Platform Ticket: ప్లాట్ ఫామ్ టికెట్ ధర రూ. 30 నుంచి మళ్ళీ రూ.10లకు తగ్గించిన రైల్వే స్టేషన్ ఎక్కడంటే.

Platform Ticket: దేశంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత మానవ జీవితంతో పాటు అనేక అంశాలపై ప్రభావం చూపించింది.  కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేపట్టిన..

Platform Ticket: ప్లాట్ ఫామ్ టికెట్ ధర రూ. 30 నుంచి మళ్ళీ రూ.10లకు తగ్గించిన రైల్వే స్టేషన్ ఎక్కడంటే.
Platform Ticket

Updated on: Nov 26, 2021 | 6:06 PM

Platform Ticket: దేశంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత మానవ జీవితంతో పాటు అనేక అంశాలపై ప్రభావం చూపించింది.  కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు గతంలో రైల్వే అధికారులు ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.30లకు పెంచారు. అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ జనజీవనం గాడిన పడుతుంది. మరోవైపు పాలనా పరమైన సంస్కరణలు కూడా మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా భారతీయ రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్ ధరను తగ్గించారు. కరోనా ముందు ఏ విధంగా రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్ ధరలున్నాయో అవే ధరలు ఇక నుంచి ఉండనున్నాయని ప్రకటించింది. దీంతో రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్ ధర. మునుపటిలా రూ. 10లకు ప్రయాణీకులకు అందుబాటులోకి వచ్చింది.

ఇప్పటికే దేశ ఆర్ధిక రాజధాని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లోని కీలక  రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌ల ధరను గురువారం నుంచి రూ.50 నుంచి రూ.10కి మారుస్తామని సెంట్రల్ రైల్వే ప్రకటించింది. అనంతరం వరసగా వివిధ రైల్వే స్టేషన్లు ప్లాట్ ఫామ్ టికెట్ ధరను తగ్గించనున్నామని ప్రకటించాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT), దాదర్, లోకమాన్య తిలక్ టెర్మినస్ (LTT), థానే, కళ్యాణ్, పన్వెల్ రైల్వే స్టేషన్లు కూడా మునిపటి ధరకే ప్లాట్ ఫామ్ టికెట్ ను అమ్మనున్నాయి.  మరోవైపు  రైల్వే అధికారులు ప్రయాణీకులకు ఆహారం అందించే పథకాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు కోవిడ్-19 నియంత్రణ కోసం ఒక సంవత్సరం క్రితం ఆగిపోయిన అన్ని రైళ్లను పునరుద్ధరించాలని నిర్ణయించాయి.

Also Read: చించినాడ బ్రిడ్జ్ సేఫ్.. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే చర్యలు తప్పవంటున్న పోలీసులు

Loading...
Unable to load recommendations.
Follow Us