Petrol Rates: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలపై కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం!

|

Apr 12, 2022 | 12:25 PM

పెట్రోల్, డీజిల్ రేట్ల నుంచి సామాన్యులకు త్వరలోనే ఉపశమనం లభించనుంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించేందుకు..

Petrol Rates: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలపై కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం!
Petrol Rates
Follow us on

పెట్రోల్, డీజిల్ రేట్ల నుంచి సామాన్యులకు త్వరలోనే ఉపశమనం లభించనుంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించేందుకు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ(MoPNG) ఆర్ధిక మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతున్నట్లు జాతీయ మీడియా బిజినెస్ టుడే పేర్కొంది. త్వరలోనే దీనిపై మరింత సమాచారం వెలువడనుందని తెలుస్తోంది. మరోవైపు పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం కింద రూ.27.90, లీటరు డీజిల్‌పై రూ.21.80 ఆదాయం వస్తోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ గతేడాది లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఏప్రిల్ 10వ తేదీ నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 19 రోజుల్లో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు లేకపోవడం ఇది ఆరోసారి. మార్చి 22 నుంచి చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరల మోత మోగిస్తున్నాయి. అటు ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరలను కూడా ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దేశీయంగా LPG సిలిండర్ల ధరలను స్థిరంగా ఉంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం మరోసారి పెరగవచ్చునని సమాచారం. 2020 నవంబర్ నుంచి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతుండటం గమనార్హం. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు గతంలో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్‌పిజి) ధరను 14.2 కిలోల సిలిండర్‌కు రూ. 50 చొప్పున పెంచిన విషయం విదితమే.