భారతీయ మంత్రులు,విపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్ నెంబర్లు హ్యాకింగ్ కి గురైనట్టు వీటిని పెగాసస్ డేటా బేస్ లో కనుగొన్నామంటూ వైర్, మరికొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు, ఆరోపణలు నిరాధారమైనవని స్పై వేర్ పెగాసస్ ను విక్రయించే ఇజ్రాయెల్ నిఘా సంస్థ
ఎన్ ఎస్ ఓ గ్రూప్ ఖండించింది. దీనిపై కోర్టులో పరువునష్టం దావా వేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపింది. లీక్ అయిన డేటా బేస్ ను ప్యారిస్ లోని మీడియా..నాన్ ప్రాఫిట్ ఫర్బిడెన్ స్టోరీస్… ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటివి పలు పత్రికలతో పంచుకున్నాయని వైర్ తదితర పత్రికలు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఏమైనా ఫర్బిడెన్ స్టోరీస్ ఆరోపణలు అన్నీ తప్పుడువని,, నిరాధారమైన కట్టుకథలని ఈ గ్రూప్ తెలిపింది. ఇలాంటివి తమ పనితీరుపై ప్రజల్లో అనుమానాలను రేకెత్తిస్తాయని పేర్కొంది. గుర్తు తెలియని వర్గాలు ఏ విధమైన వాస్తవిక ఆధారాలు లేని సమాచారాన్ని అందజేసినట్టు కనిపిస్తోందని,, ఈ వార్తలను ధృవీకరించే ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు లేవని దుయ్యబట్టింది. ఇది తప్పుడు సమాచారమని, తమ సర్వర్లలో అలాంటి డేటా ఏదీ లేదని వివరించింది. మా సర్వర్ల ను నుంచి డేటా లీక్ అయినట్టు చెబుతున్నది అబధ్ధం..హాస్యాస్పదం.. అసలు జమాల్ ఖషోగీ దారుణ హాత్యకు, మా టెక్నాలజీకి సంబంధం లేదు అని స్పష్టం చేసింది.
జమాల్ కుటుంబ సమాచారాన్ని తెలుసుకునేందుకు మేము ఎలాంటి టెక్నాలజీని వినియోగించలేదని కూడా ఈ గ్రూప్ వెల్లడించింది. తమ గ్రూప్ లైఫ్ సేవింగ్ మిషన్ అని, ఎవరు అడ్డొచ్చినా దీన్ని తాము నిర్వహించి తీరుతామని పేర్కొంది. పెగాసస్ వ్యవహారం ఇండియాలో పెద్ద దుమారాన్నే రేపింది. పార్లమెంటులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఇతర విపక్ష నేతలు దీనిపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇంత బాహాటంగా ప్రముఖుల ఫోన్ నెంబర్లు హ్యాకింగ్ కి గురవుతున్నాయంటే ప్రభుత్వం ఏం చేస్తోందని వారు ప్రశ్నించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ‘కర్నాటకలో నాయకత్వ మార్పు’… లీకైన వివాదాస్పద ఆడియో టేపు కలకలం… అది ఫేక్ అంటున్న రాష్ట్ర బీజేపీ చీఫ్
OTT: ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలివే.. లిస్టులో రెండు బడా చిత్రాలు!