Vande Bharat: వందేభారత్‌లో ఫుడ్ పార్శిల్ కొన్నాడు.. తీరా దాన్ని ఓపెన్ చేయగా.!

|

Jul 28, 2023 | 4:38 PM

రైలు ప్రయాణాల్లో అప్పుడప్పుడూ మనం కొనే ఫుడ్ పార్శిల్స్‌ నాసిరకంగా ఉంటాయి. ఇదే కోవలో తాజాగా ఓ రైల్వే ప్రయాణీకుడికి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో షాకింగ్ అనుభవం ఎదురైంది. తన ప్రయాణంలో భాగంగా ట్రైన్ ఫుడ్ పార్శిల్ ఆర్డర్ ఇచ్చిన అతడికి.. షాక్ అయ్యే సీన్ కనిపించింది. దీంతో దెబ్బకు అతడు దడుసుకున్నాడు. ఆ వెంటనే IRCTCకి ఫిర్యాదు చేశాడు. ఇంతకీ ఏం జరిగింది.? అసలు ఈ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

Vande Bharat: వందేభారత్‌లో ఫుడ్ పార్శిల్ కొన్నాడు.. తీరా దాన్ని ఓపెన్ చేయగా.!
Vande Bharat Express
Follow us on

రైలు ప్రయాణాల్లో అప్పుడప్పుడూ మనం కొనే ఫుడ్ పార్శిల్స్‌ నాసిరకంగా ఉంటాయి. ఇదే కోవలో తాజాగా ఓ రైల్వే ప్రయాణీకుడికి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో షాకింగ్ అనుభవం ఎదురైంది. తన ప్రయాణంలో భాగంగా ట్రైన్ ఫుడ్ పార్శిల్ ఆర్డర్ ఇచ్చిన అతడికి.. అందులో బొద్దింక దర్శనమివ్వడంతో.. దెబ్బకు దడుసుకున్నాడు. వెంటనే ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా ఐఆర్‌సీటీసీ ఫిర్యాదు చేశాడు.

ఇక దీనిపై సదరు ప్రయాణీకుడి ఫిర్యాదుపై స్పందించింది ఐఆర్‌సీటీసీ. ‘మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించండి. మరోసారి ఇది రిపీట్ కాకుండా చూసుకుంటాం. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి.. ఇప్పటికే సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌కు ఆహార తయారీ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించాం.’ అని IRCTC పేర్కొంది. కాగా, ఆ సర్వీస్ ప్రొవైడర్‌పై భారీ జరిమానా కూడా విధించినట్టు స్పష్టం చేసింది.