పాక్ మహిళకు భారత పౌరసత్వం.. సర్పంచ్ పదవి కైవశం

సీఏఎ, ఎన్నార్సీలపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్న తరుణంలో.. పాకిస్తాన్ లో  పుట్టి.. భారత గడ్డపై చదువుకున్న ఓ మహిళ అనూహ్యంగా సర్పంచ్ పదవిని  దక్కించుకుంది.  నీతా కన్వర్ అనే 36 ఏళ్ళ ఈమెకు గత సెప్టెంబరులో భారత పౌరసత్వం లభించడం… సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి.. ఆమె సర్పంచ్ గా విజయం సాధించడం జరిగిపోయింది. రాజస్థాన్ లోని టోంక్ జిల్లా నట్వాడా గ్రామంలో జరిగిందీ ‘వింత’ ! తన సమీప ప్రత్యర్థిని ఈమె 362 ఓట్ల ఆధిక్యతతో […]

పాక్ మహిళకు భారత పౌరసత్వం.. సర్పంచ్ పదవి కైవశం

Edited By:

Updated on: Jan 18, 2020 | 5:25 PM

సీఏఎ, ఎన్నార్సీలపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్న తరుణంలో.. పాకిస్తాన్ లో  పుట్టి.. భారత గడ్డపై చదువుకున్న ఓ మహిళ అనూహ్యంగా సర్పంచ్ పదవిని  దక్కించుకుంది.  నీతా కన్వర్ అనే 36 ఏళ్ళ ఈమెకు గత సెప్టెంబరులో భారత పౌరసత్వం లభించడం… సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి.. ఆమె సర్పంచ్ గా విజయం సాధించడం జరిగిపోయింది. రాజస్థాన్ లోని టోంక్ జిల్లా నట్వాడా గ్రామంలో జరిగిందీ ‘వింత’ ! తన సమీప ప్రత్యర్థిని ఈమె 362 ఓట్ల ఆధిక్యతతో ఓడించగలిగింది. ఈ పదవికి ఈ గ్రామంలో ఏడుగురు మహిళలు పోటీ చేశారు. పాకిస్తాన్ లో జన్మించి.. ఇండియాకు చేరుకున్న నీతా.. అజ్మీర్ లోని ఓ కాలేజీలో గ్రాడ్యుయేట్ పట్టా అందుకుంది.  2011 ఫిబ్రవరిలో నట్వారా  గ్రామానికే చెందిన పుణ్య ప్రతాప్ కరన్ అనే వ్యక్తిని ఈమె పెళ్లి చేసుకుంది. భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోగా గత ఏడాది సెప్టెంబరులో ఆ ‘ హోదా ‘ లభించింది. తన కుటుంబానికే కాక.. ఈ గ్రామానికి కూడా తాను ఓ కోడలుగా సేవ చేస్తానని, సర్పంచ్ గా ఈ గ్రామప్రజల సమస్యలు తీర్చడానికి కృషి చేస్తానని నీతా కన్వర్ అంటోంది.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us