Union Bank Fraud: బ్యాంకులో “చిల్లర దొంగలు”.. రూ.15లక్షలు మాయం చేశారు.. ఇంటి దొంగల పనేనా..?

|

Feb 04, 2021 | 2:43 PM

ఒడిశాలో ఓ విచిత్ర స్కామ్ వెలుగులోకి వచ్చింది. అయితే ఈ స్కామ్ ఇంటి దొంగల పనే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. 

Union Bank Fraud: బ్యాంకులో  చిల్లర దొంగలు.. రూ.15లక్షలు మాయం చేశారు.. ఇంటి దొంగల పనేనా..?
Follow us on

ఒడిశాలో ఓ విచిత్ర స్కామ్ వెలుగులోకి వచ్చింది. అయితే ఈ స్కామ్ ఇంటి దొంగల పనే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే..  ఒడిశాలోని పారాదీప్​ఘర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో దాదాపు రూ.15లక్షల మోసం జరిగినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ శాఖలో 2016-2020 మధ్య జమైన నాణేలు మిస్సైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వీటి విలువ రూ.14.86 లక్షలు ఉంటుందని మేనేజర్ సంతోష్​ కుమార్ వెల్లడించారు.

సంతోష్​ గత నెలలోనే జనరల్​ మేనేజర్​గా బాధ్యతలు చేపట్టారు. ఒకసారి ఫైల్స్ అన్ని తిరగేశారు. అన్ని విభాగాలపై ఫోకస్ పెట్టారు. అంతర్గత ఆడిట్ కూడా చేశారు. దీంతో చిల్లర దొంగల బాగోతం వెలుగులోకి వచ్చింది.  బ్యాంకులోని రూపాయి, రెండు, అయిదు రూపాయల నాణేలు లెక్కల్లో ఉన్నప్పటికీ కనిపించట్లేదని మేనేజర్ సంతోష్ చెప్పారు. విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

Also Read:

Chris Gayle: సప్త సముద్రాలు ఈదినవాడికి పిల్లకాలవే ఎదురొస్తే..? క్రిస్ గేల్ విధ్వంసకర ఇన్నింగ్స్…

Variety Theft: పిల్లులు పట్టేవాళ్లమంటూ వచ్చారు.. ఇళ్లంతా దోచుకుని వెళ్లిపోయారు.. తస్మాత్ జాగ్రత్త