భారత్ మార్క్ వ్యూహం.. 88 గంటల్లోనే పాతాళానికి పాకిస్తాన్.. ఉగ్రమూకలకు లైఫ్‌టైమ్ లెస్సన్!

జస్ట్ 9 టార్గెట్లు, మొత్తం 21 దాడులు, పనిముగించడానికి 25 నిమిషాలు. ఇదే ఆపరేషన్ సింధూర్. ఓస్.. టార్గెట్లు తొమ్మిదేనా అంటారేమో. ఇజ్రాయెల్ దమ్ము ధైర్యానికి కేరాఫ్ అయిన మొసాద్ చరిత్రలో సైతం ఒకేసారి 9 చోట్ల దాడి చేసిన దాఖలాలు లేవు. దట్ ఈజ్ ఇండియన్ ఆర్మీ..

భారత్ మార్క్ వ్యూహం.. 88 గంటల్లోనే పాతాళానికి పాకిస్తాన్.. ఉగ్రమూకలకు లైఫ్‌టైమ్ లెస్సన్!
Operation Sindoor Anniversary

Updated on: May 07, 2026 | 9:49 PM

పసివాళ్లైన పాండవ కుమారులను నిద్రలోనే దారుణంగా చంపేస్తే.. ఉత్తర గర్భంలోని శిశువుపై ఏకంగా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే.. కోపోద్రిక్తుడైన శ్రీకృష్ణుడు అశ్వత్థామనేం చంపలేదు. నుదుటిపై సహజసిద్ధంగా ఉన్న మణిని తీసేశాడు. జీవచ్చవంలా చేశాడు. భారత లక్ష్యమూ అదే. పాక్‌ను ఓడించాల్సిన అవసరం లేదు. అసలది ఎప్పుడు గెలిచింది గనక. బట్.. దాని బలాల్ని చంపాలి. భారత్ చేసింది కూడా అదే. కాని కొందరు మాట్లాడారు.. పట్టుమని నాలుగు రోజులు యుద్ధం చేయకపోవడమేంటి అని. బట్… ఆపరేషన్ సింధూర్‌ను పొడిగించకపోవడమే మంచిదైందని ఎలా చెబితే అర్ధమవుతుంది వాళ్లకి. భారత్‌ను ఓ ట్రాప్‌లో పెట్టాలనుకున్న కొన్ని తలకాయలకు ఇండియన్ ఆర్మీ వేసిన రివర్స్ స్కెచ్ అని ఎలా చెప్పాలి వాళ్లకి. ఇంకాస్త డీప్‌గా చెప్పుకుందాం అలాంటి వాళ్ల కోసం. ఆపరేషన్ సింధూర్ భారత్ వర్సెస్ పాక్ యుద్ధం కాదు. ఇండియన్ ఆర్మీ, పాక్ ఆర్మీ ఫేస్ టు ఫేస్ తలపడితే కదా దాన్ని యుద్ధం అంటారు. ఇది దండయాత్ర. అయినా.. యుద్ధం కేవలం పాక్‌తోనేనా! భారత్ వర్సెస్ పాకిస్తాన్ ప్లస్ చైనా ప్లస్ టర్కీ ప్లస్ అమెరికా డీప్ స్టేట్ ప్లస్ బంగ్లాదేశ్ ప్లస్ దేశంలోని అంతర్గత శత్రువులు. వీళ్లందరితోనూ యుద్ధం చేయాలి. అసలు.. భారత్‌ను ఓ భారీ...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి