హైవేలపై కొనసాగుతున్న అన్నదాతల నిరసనలు.. 700 ట్రాక్టర్లతో ఢిల్లీ బయలుదేరిన కిసాన్ మజ్దూర్ కమిటీ..

|

Dec 12, 2020 | 11:36 AM

ఒకటి రెండు రోజులు ఆందోళన చేసి వచ్చిన దారినే వెళ్లిపోతారు అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. కేంద్రం ఊహించని రీతిలో

హైవేలపై కొనసాగుతున్న అన్నదాతల నిరసనలు.. 700 ట్రాక్టర్లతో ఢిల్లీ బయలుదేరిన కిసాన్ మజ్దూర్ కమిటీ..
Follow us on

ఒకటి రెండు రోజులు ఆందోళన చేసి వచ్చిన దారినే వెళ్లిపోతారు అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. కేంద్రం ఊహించని రీతిలో అన్నదాతలు ఆందోళనలు ఉధృతం చేశారు. సరిహద్దుల్లో రెప్ప వాల్చని సైనికుల్లా కదం తొక్కారు. రైతుల దండయాత్ర హస్తినాను వణికిస్తోంది. పోలీసులు లాఠీలు జులిపిస్తున్నా అడుగు వెనుకకు పడటం లేదు.

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో రైతులు వెనక్కి తగ్గటం లేదు. వారి ఆందోళనలకు మద్దతు పెరుగుతోంది. అమృత్‌సర్‌లో కిసాన్ మజ్దూర్ కమిటీ నాయకులు 700 ట్రాక్టర్లతో ఢిల్లీ బయలుదేరారు. ఢిల్లీ జైపూర్, ఢీల్లీ ఆగ్రా సరిహద్దులను దిగ్భందనం చేశారు. అంతేకాదు టోల్ గేట్ల వద్ద రుసుం చెల్లించకుండా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. రైల్‌రోకో, బీజేపీ నేతల ఘోరావ్, టోలప్లాజాల దగ్గర ధర్నాలు చేయాలన్నారు. ఇదిలా ఉంటే వ్యవసాయ చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన కేసులో తమను కూడా వాదిగా చేర్చుకోవాలని కోరుతూ భారతీయ కిసాన్ యూనియన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ చట్టాల రాజ్యంగ బద్ధత సవాల్ చేస్తూ డీఎంకే ఎంపీ తిరూచి శివ ఇంతకు ముందే వ్యాజ్యం దాఖలు చేశారు. తాము కూడా చేరుతామంటు ఈ సంఘ్ పిటిషన్ సమర్పించింది. అయితే ఇవాళ కోర్టు ఏం చెబుతుందో ఉత్కంటగా మారింది.