Nurse Attack: యువకుడిని చితకబాదిన నర్సు.. ఆస్పత్రిలోని రూమ్ లో బంధించి.. చక్కర్లు కొడుతున్న వీడియో

ఆస్పత్రుల్లో డాక్టర్లు అందుబాటులోకి లేకపోతే.. వైద్యం కోసం వచ్చిన వారికి నర్సులు అప్పుడప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయడం మనకు తెలిసిందే. సూదులు ఇవ్వడం, మందులు సూచించడం, పరీక్షలు చేయించడం వంటివన్నీ..

Nurse Attack: యువకుడిని చితకబాదిన నర్సు.. ఆస్పత్రిలోని రూమ్ లో బంధించి.. చక్కర్లు కొడుతున్న వీడియో
Nurse Attack Video

Updated on: Oct 19, 2022 | 10:37 AM

ఆస్పత్రుల్లో డాక్టర్లు అందుబాటులోకి లేకపోతే.. వైద్యం కోసం వచ్చిన వారికి నర్సులు అప్పుడప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయడం మనకు తెలిసిందే. సూదులు ఇవ్వడం, మందులు సూచించడం, పరీక్షలు చేయించడం వంటివన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటారు. ఎంతో ఓర్పుతో ఉంటూ పేషంట్ల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. కానీ అలాంటి నర్సులు ఓ ఆస్పత్రిలో ఏం చేశారో తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఇంతకీ వాళ్లేం చేశారో తెలుసా.. హా.. అదేనండీ.. ఆస్పత్రికి వచ్చిన ఇద్దరు యువకులను ఏ రూమ్ లో వేసి చితకబాదింది ఓ నర్స్‌. తమను కొట్టొద్దని ఎంత ప్రాధేయపడినా ఆమె కనికరించలేదు. ఇంతకీ ఆ నర్సుకు అంత కోపం రావడానికి కారణం ఏంటంటే.. బీహార్‌కు చెందిన ఇద్దరు యువకులు మెడికల్ సర్టిఫికేట్‌ కోసం ఛప్రాలోని సదర్ ఆస్పత్రికి వెళ్లారు. అయితే, ఆస్పత్రిలో సిబ్బంది తీరు, అక్కడ కనిపించే లోపాలను ఫోన్ లో చిత్రీకరించడం ప్రారంభించారు. దీంతో ఆరోగ్య కార్యకర్తలు, నర్సులు వారిని వీడియోలు తీయొద్దంటూ వారించారు. అయినా వినకపోవటంతో ఆస్పత్రి సిబ్బంది ఇద్దరినీ పట్టుకుని ఓ గదిలోనిర్బంధించి కర్రలతో చితకబాదారు. తమను కొట్టొద్దని యువకులు ప్రాధేయపడినప్పటికీ వారిని నర్సు కొడుతూనే ఉన్నారు.

దీనికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు బిహార్‌ ఆరోగ్య శాఖకు వీడియోను ట్యాగ్‌ చేస్తూ ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అదేసమయంలో మరికొందరు నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఆ యువకులు నర్సులతో అసభ్యంగా ప్రవర్తించారని, ఆసుపత్రి సిబ్బంది చేసింది కరక్టేనని పేర్కొన్నారు. ఈ ఘటనపై మీడియా ప్రతినిధుల నుంచి సమాచారం అందిందని, సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ సాగర్‌ దులాల్‌ సిన్హా తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావటంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ జోక్యం చేసుకుని యువకులను విడుదల చేసినట్లు తెలిసింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి