
కరూరు తొక్కిసలాటపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై సిట్‌తో దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి అస్రా గర్గ్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం ఈ ఘటనపై రిటైర్డ్ జడ్జి అరుణా జగదీశన్ నేతృత్వంలో న్యాయ విచారణకు ఆదేశించింది.
విజయ్‌తో పాటు TVK నేతల తీరుపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తొక్కిసలాట తరువాత TVK నేతలు ఎక్కడికి వెళ్లారని , చాలా బాధ్యతారహితంగా ప్రవర్తించారని మండిపడింది. బాధితులను పట్టించుకోలేదని వ్యాఖ్యానించింది. తొక్కిసలాట ఘటన తరువాత విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది.
విజయ్‌కి నాయకత్వ లక్షణాలు లేవని కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ దుర్ఘటనకు బాధ్యులెవరనేదే ప్రశ్న.. ఐతే తొక్కిసలాట వెనక కుట్ర ఉందని TVK నేత ఆదవ్ అర్జున మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌కు విన్నవించారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు టీవీకే పిటిషన్‌ను కొట్టేసింది. విచారణ ప్రారంభ దశలోనే CBI విచారణ కోరడం సరికాదని , న్యాయస్థానాలను రాజకీయ వేదికగా మార్చొద్దన్న కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది..
రాజకీయ సభల అనుమతుల విషయంలో ప్రభుత్వాన్ని వివరణ అడింది హైకోర్టు. – అఖిల పక్షం నేతలతో చర్చించి కొత్త నియమాలను తీసుకొస్తామన్న ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.. అయితే అప్పటివరకు ఎలాంటి రాజకీయ పార్టీ సభలకు అనుమతి ఇవ్వడం లేదని వివరణ ఇచ్చారు. కేవలం ముందుగా ఎవరైతే అనుమతి తీసుకున్నారో వారికి మాత్రం అనుమతి ఉంటుందని.. ఇకపై ఏ పార్టీకి అనుమతులు ఉండవు అంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది..