రాష్ట్రంలోని పాఠశాలలు రేపట్నుంచి తిరిగి తెరచుకుంటాయని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ సోమవారం (జనవరి 16) ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ క్రమంలో బుధవారం నాడు సెలవు లేదని ఆయన అన్నారు. కాగా సంక్రాంతి సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు జనవరి 15 (పొంగల్), 16 (క్యాటిల్ పొంగల్), 17 (కన్ను పొంగల్) తేదీల్లో మూడు రోజులపాటు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
ఐతే తాజాగా జనవరి 18న కూడా పాఠశాలలకు ప్రభుత్వం సెలవు మంజూరు చేసినట్లు నకిళీ వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. దీనిపై విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ క్లారిటీ ఇస్తూ.. బుధవారం నాడు సెలవు లేదని, దీనిపై ప్రభుత్వం ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదని, జనవరి 18న విద్యాసంస్థలన్నీ తిరిగి తెరచుకుంటాయని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.