వెంటిలేటర్‌పైనే ప్రణబ్.. ఆరోగ్యంలో మార్పు లేదు

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని.. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. తాజాగా మంగళవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో ప్రణబ్ హెల్త్ కండీషన్ గురించి వివరించారు వైద్యులు. ఆయన ఇంకా వెంటిలేటర్‌పైననే..

వెంటిలేటర్‌పైనే ప్రణబ్.. ఆరోగ్యంలో మార్పు లేదు

Updated on: Aug 25, 2020 | 4:56 PM

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని.. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. తాజాగా మంగళవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో ప్రణబ్ హెల్త్ కండీషన్ గురించి వివరించారు వైద్యులు. ఆయన ఇంకా వెంటిలేటర్‌పైననే చికిత్స తీసుకుంటున్నారని, అయితే ప్రణబ్ శరీరంలోని కొన్ని ముఖ్యమైన అవయవాలు మాత్రం పని చేస్తున్నట్లు పేర్కొన్నారు వైద్యులు. కాగా ఈ నెల 10వ తేదీన ఆర్మీ ఆస్పత్రిలో చేరిన ప్రణబ్ ముఖర్జీకి వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో ప్రణబ్‌కు కరోనా వైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. దీంతో పరిస్థితి విషమించి ఆయన కోమాలోకి వెళ్లిపోయారు.

Read More:

సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ కాలేజీల్లో ఆన్‌లైన్‌ క్లాసులు

తెలంగాణలో కరోనా వైరస్ అదుపులోనే ఉంది

కోవిడ్ భయంతో కాంగ్రెస్ నేత ఆత్మహత్య

వినూత్న ప్రయోగం.. వాట్సాప్‌లో గణేష్ లడ్డూ వేలం

బిగ్‌బాస్-4 ఎంట్రీపై నటుడు నందు క్లారిటీ

Loading...
Unable to load recommendations.
Follow Us