హమ్మయ్య ! ఢిల్లీలో బర్ద్ ఫ్లూ లేనట్టే 1 అన్ని శాంపిల్స్ టెస్టుల్లో నెగెటివ్ ఫలితాలు వచ్చినట్టు పశుసంవర్ధక శాఖ వెల్లడి

| Edited By: Pardhasaradhi Peri

Jan 14, 2021 | 12:27 PM

ఢిల్లీలో బర్ద్ ఫ్లూ లేదని స్పష్టమైంది. నగరంలోని ఘాజీపూర్ చికెన్ మార్కెట్ నుంచి పంపిన పౌల్ట్రీ శాంపిల్స్ లో బర్ద్ ఫ్లూ లేదా ఏవియన్ ఫ్లూ ఆనవాళ్లు లేవని పశుసంవర్ధక శాఖ ప్రకటించింది..

హమ్మయ్య ! ఢిల్లీలో బర్ద్ ఫ్లూ లేనట్టే 1 అన్ని శాంపిల్స్ టెస్టుల్లో నెగెటివ్ ఫలితాలు వచ్చినట్టు పశుసంవర్ధక శాఖ వెల్లడి
Follow us on

ఢిల్లీలో బర్ద్ ఫ్లూ లేదని స్పష్టమైంది. నగరంలోని ఘాజీపూర్ చికెన్ మార్కెట్ నుంచి పంపిన పౌల్ట్రీ శాంపిల్స్ లో బర్ద్ ఫ్లూ లేదా ఏవియన్ ఫ్లూ ఆనవాళ్లు లేవని పశుసంవర్ధక శాఖ ప్రకటించింది. 104 శాంపిల్స్ ఫలితాలు బుధవారం సాయంత్రం అందాయని, వీటిలో ఈ మార్కెట్ లోని 35 కోళ్ల నుంచి సేకరించిన 100 శాంపిల్స్ లో అన్నీ నెగెటివ్ రిజల్ట్స్ వచ్చాయని ఈ శాఖకు చెందిన సీనియర్ అధికారి రాకేష్ సింగ్ తెలిపారు. ఢిల్లీలోని పౌల్ట్రీ కోళ్ళలో ఏవియన్ ఫ్లూ వ్యాపించలేదని దీన్ని బట్టి అర్థమవుతోందని ఆయన చెప్పారు. ఆసియాలోనే అతిపెద్దదైన ఘాజీపూర్ హోల్ సేల్ మార్కెట్ ను ఇటీవల 10 రోజులపాటు   మూసివేశారు. నగరంలోని వివిధ పార్కుల్లో ఈ మధ్య పక్షులు హఠాత్తుగా మరణించడంతో ఇక్కడ బర్ద్ ఫ్లూ తలెత్తవచ్ఛునని ఆందోళన మొదలైంది. ఢిల్లీ, మహారాష్ట్ర సహా దేశంలోని 10 రాష్ట్రాల్లో బర్ద్ ఫ్లూ ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. అయితే తాజాగా ఢిల్లీలో ఈ బెడద లేదని స్పష్టమైంది.

తమ మార్కెట్ ను మూసివేయడంతో తమకు 2 కోట్లకు పైగా నష్టం వచ్చిందని ఘాజీపూర్ మార్కెట్ వ్యాపారులు కలవరం చెందారు. ఇప్పుడు బర్ద్ ఫ్లూ లేదని తెలియడంతో వారు ఊపిరి పీల్చుకుంటున్నారు.