
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జన్‌పథ్ రోడ్డు లోని CCS బిల్డింగ్‌లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఢిల్లీ సెక్రటేరియట్‌తో పాటు పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉన్నాయి. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలానికి 13 ఫైరింజన్లు చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. 30 నిమిషాల్లో మంటలను అదుపులోకి తెచ్చారు.
ఢిల్లీలో వేసవి తీవ్రత బాగా పెరిగింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా పలు చోట్ల అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. CCS బిల్డింగ్ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు గుర్తించారు. CCS భవనంలోని మొదటి అంతస్తులోని ఫర్నిచర్‌లో మంటలు చెలరేగాయి. మొత్తం 15 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
जनपथ रोड पर निर्माणाधीन CCS 2 बिल्डिंग में लगी आग। किसी के हताहत होने की खबर नहीं, दमकल विभाग ने आग पर काबू पाया। @DelhiPolice pic.twitter.com/zvRCVy0Y6Q
— Rajesh Kumar (@jagranrajesh123) June 14, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..