జమ్మూ కాశ్మీర్ కి 370 అధికరణాన్ని పునరుధ్ధరించేంతవరకు తన పోరాటం ఆగదని మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా అన్నారు. తనను ఉరి తీసినా సరే తన లక్ష్యం మారదన్నారు. అటు-జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ కి సంబంధించిన కోట్లాది స్కామ్ లో ఫరూక్ ప్రమేయంపై ఈడీ ఆయనను విచారించింది. ఈయనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఆ అసోసియేషన్ కి సంబంధించి రూ. 40 కోట్ల సొమ్ము గోల్ మాల్ జరిగిందని ఈడీ భావిస్తోంది. ఫరూక్ అబ్దుల్లాకు సమన్లు జారీ చేసింది. అయితే ఈ అంశం కోర్టు పరిశీలనలో ఉందని, దీనిపై తానేమీ వ్వ్యాఖ్యానించబోనని ఆయన పేర్కొన్నారు.