యుక్త వయసు మైనర్లు ఇష్టప్రకారం పెళ్లి చేసుకుంటే చెల్లుతుంది.. సంచలన తీర్పు ఇచ్చిన హర్యానా హైకోర్టు

|

Feb 10, 2021 | 1:44 PM

ఇస్లామిక్ చ‌ట్టం ప్రకారం యుక్త వ‌య‌సు మైన‌ర్ ముస్లిం బాలిక త‌న ఇష్టం మేర‌కు పెళ్లి చేసుకునే హ‌క్కు ఉంద‌ని హైకోర్టు స్పష్టం చేసింది.

యుక్త వయసు మైనర్లు ఇష్టప్రకారం పెళ్లి చేసుకుంటే చెల్లుతుంది.. సంచలన తీర్పు ఇచ్చిన హర్యానా హైకోర్టు
Follow us on

Muslim minor girl marriage : మైనర్ల వివాహంపై పంజాబ్ – హ‌ర్యానా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇస్లామిక్ చ‌ట్టం ప్రకారం యుక్త వ‌య‌సు మైన‌ర్ ముస్లిం బాలిక త‌న ఇష్టం మేర‌కు పెళ్లి చేసుకునే హ‌క్కు ఉంద‌ని హైకోర్టు స్పష్టం చేసింది. ఇస్లామిక్ చ‌ట్టంలోని ఆర్టిక‌ల్ 195ని ఈ సంద‌ర్భంగా కోర్టు ప్రస్తావించింది. యుక్త వయస్కులైన మైన‌ర్లు వారి గార్డియ‌న్ల ద్వారా వివాహ బంధంలోకి అడుగుపెట్టవ‌చ్చు. మైన‌ర్లకు నచ్చితే.. త‌మకు ఇష్టం మేర‌కు గార్డియ‌న్ అనుమ‌తి ఉన్నా లేక‌పోయినా పెళ్లి చేసుకోవ‌చ్చని ఆ ఆర్టిక‌ల్‌లో చెప్పిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా కోర్టు గుర్తు చేసింది.

పంజాబ్‌కు చెందిన ఓ ముస్లిం జంట వేసిన పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన జ‌స్టిస్ అల్కా స‌రిన్ ఈ మేర‌కు తీర్పు వెలువ‌రించారు. 37 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి, 17 ఏళ్ల అమ్మాయిని గ‌త నెల 21న పెళ్లి చేసుకున్నారు. అయితే, వారి వివాహం ఇష్టం లేని కుటుంబ స‌భ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, త‌మ‌ను కుటుంబసభ్యులు బెదిరిస్తున్నార‌ని, వాళ్ల నుంచి ర‌క్షణ క‌ల్పించాల‌ంటూ ఈ జంట కోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణ జరిపిన హర్యానా, పంజాబ్ కోర్టు.. అమ్మాయి మైన‌ర్ అయినా కూడా ఇస్లామిక్ చ‌ట్టం ప్రకారం ఈ పెళ్లి చెల్లుతుంద‌ని తీర్పు చెప్పింది కోర్టు. వారి పెళ్లిని ధృవీకరించిన హైకోర్టు.. వారికి ర‌క్షణ క‌ల్పించాల‌ని మొహాలీ ఎస్ఎస్‌పీని ఆదేశించింది.

ఇదీ చదవండి… యువకుడిపై కోపంతో అఘాయిత్యం.. ఇద్దరికి జీవిత ఖైదు, మరొకరికి ఐదేళ్ల జైలు శిక్ష విధించిన యూఏఈ కోర్టు