Mumbai: బీభత్సం సృష్టించిన డంపర్.. వరుసగా 9 వాహనాలపై దూసుకెళ్లింది.. షాకింగ్ వీడియో..

|

Sep 26, 2022 | 1:32 PM

Mumbai: మహారాష్ట్రంలోని ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నవీముంబైలో ఓ డంపర్ బీభత్సం సృష్టించింది. ఒకటి కాదు..

Mumbai: బీభత్సం సృష్టించిన డంపర్.. వరుసగా 9 వాహనాలపై దూసుకెళ్లింది.. షాకింగ్ వీడియో..
Accident
Follow us on

Mumbai: మహారాష్ట్రంలోని ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నవీముంబైలో ఓ డంపర్ బీభత్సం సృష్టించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 9 వాహనాలపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలవగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నవీ ముంబైలోని వాషీ టోల్‌ ప్లాజా దగ్గర వరుసగా 9 వాహనాలను ఢీకొట్టింది డంపర్. ఈ ఘటనలో ఓ బైక్‌, ఓ బస్సుతో పాటు 7 కార్లు ధ్వంసమయ్యాయి. చివరకు టోల్‌ ప్లాజా దగ్గరున్న బారికేడ్‌ను ఢీకొట్టి ఆగిపోయింది ఆ డంపర్. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు అధికారులు. అయితే, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. నవీముంబై వైపు నిర్మాణ శిథిలాలతో వేగంగా వెళ్తూ అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. రద్దీగా ఉన్న టైమ్‌లో ఈ ఘటన జరగడంతో ఆ రూట్‌లో రెండు గంటలపాటు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. విషయం తెలుసుకొన్న అధికారులు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకి తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీకెమెరా ఫుటేజీలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..