Mullaperiyar Dam: తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మళ్ళీ జలవివాదం రాజుకుంది. ముల్లైపెరియారు డ్యామ్ కేంద్రం గా ఇరు రాష్ట్రాల్లో నిరసనలు హోరెత్తుతున్నాయి. కేరళ, తమిళనాడు మధ్య ఉన్న ఈ ఆనకట్ట.. సుదీర్ఘ చరిత్రతో పాటు ఈ రెండు రాష్ట్రాల వివాదాలకు కేంద్రంగా నిలిచింది. అయితే జలవివాదం ఇప్పుడు సినీ ప్రముఖుల మద్దతుతో కీలక మలుపు తీసుకుంది. ముల్లైపెరియారు డ్యామ్ నీటి కోసం కేరళ ప్రజలు చేస్తున్న నిరసనలకు.. కేరళ ప్రజలకు మద్దతు మలయాళ సినీ ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. దీంతో మలయాళ నటులకు వ్యతిరేకంగా తమిళనాడు లో నిరసనలు చేపట్టారు. అంతేకాదు తమ రాష్ట్రంలో మలయాళ నటులు నటించిన సినిమాల విడుదలను అడ్డుకుంటామని తమిళ సంఘాలు హెచ్చరించారు.
కేరళ – తమిళనాడు రాష్ట్రాలకి నీటి విదుదల విషయంలో కీలకం గా ఉన్న ముల్లపెరియార్ డ్యాం విషయంలో ఇరురాష్ట్రాల మధ్య ఎన్నోసార్లు వివాదాలు తలెత్తాయి. డ్యాం భద్రతపై ఆందోళనలు, నీటి మట్టం స్థాయి విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు వీటికి కారణమయ్యాయి. డ్యామ్ లో 142 అడుగుల వరకు నీటిని నిలువ చేయాలనీ తమిళనాడు సర్కార్ వాదన . డ్యాం ప్రస్తుత పరిస్థితిని బట్టి 136 అడుగుల వరకే నీటిని నిలువ చేయాలని కేరళ సర్కార్ వాదన. ముల్లైపెరియారు డ్యాం నాణ్యత పూర్తిగా తగ్గిపోయిందని సమీపం లో మరో డాం నిర్మించాలని కేరళ సర్కార్ ప్రయత్నిస్తోంది. కొత్త డ్యామ్ నిర్మిస్తే తమిళనాడు కి పూర్తిగా అందవలసిన నీటిని కోల్పోయే అవకాశముందని ఆ రాష్ట్ర సర్కార్ వాదన చేస్తోంది. అయితే ప్రస్తుతం సేవ్ కేరళ , డి కమిషన్ ముల్లైపెరియారు డ్యామ్ హాష్ టాగ్స్ సోషల్ మీడియా లో ట్రేండింగ్ లో ఉంది.
డ్యాం విషయంలో కేరళ ప్రజలు చేస్తున్న నిరసనలకు మద్దతు తెలపడమే కాదు.. మలయాళ సినీ నటులు , పృథ్విరాజ్, ఉన్నిముకుంద్ తో సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదిక గా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే డ్యామ్ నీటి విలువ 136 అడుగులకే పరిమితం చేస్తే తమిళనాడు లోని మదురై , దిండిగల్, తేని , రామనాథపురం జిల్లాలో పూర్తిగా రైతులు నష్టపోయే అవకాశం ఉండంతో.. మలయాళ నటులకి వ్యతిరేకం గా తమిళనాడు లోని తేని జిల్లాలో నిరసనలు చేస్తున్నారు. అంతేకాదు పృథ్విరాజ్, ఉన్నిముకుంద్, తో సహా అందరూ తమిళనాడు ప్రజలకు క్షమాపణ చెప్పాలని లేని పక్షం లో వారి సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే ముల్లైపెరియారు డ్యాం భద్రతా సమస్యలు, నీటి సామర్థ్యం విషయంలో ఇరురాష్ట్రాల వాదనలు ఎలా ఉన్నా.. ఆనకట్ట మాత్రం 125 ఏళ్ళు దాటినా తన వన్నె కోల్పోలేదు.
Also Read: రసం పీల్చు పురుగుల నివారణకు సహజమైన ఎరువుగా వావిలాకు కాషాయం తయారీ ఎలాగంటే..