
Motorcycle Crushed Into Pieces: నేటి జనరేషన్ కు 24గంటల సమయం సరిపోవడం లేదు.. కాలంతో పోటీ పడుతూ.. కాసుల వేట కోసం పరుగులు పెడుతున్నారు.. ఎవరు చూసినా బిజీబిజీ.. టైం తో పోటీపడుతూ పనులు చేయాలని ప్రయత్నించే సమయంలో ఎన్నో అనర్ధాలను కొనితెచ్చుకుంటున్నారు. ఒకొక్కసారి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా రైలు పట్టాలు దాటే సమయంలో నిర్లక్ష్యంగా ఉంటే.. ఎంతటి ప్రమాదం జరుగుతుందో.. మాటల్లో చెప్పలేము.. తాజాగా రైలు వస్తున్న సమయంలో రైల్వే క్రాసింగ్ దగ్గర అందరూ ఆగినా.. ఓ యువకుడు మాత్రం బైక్ తో పాటు.. పట్టాలు దాటడానికి ప్రయత్నించాడు.. ట్రైన్ తో పాటు పోటీపడి రైలు పట్టాలను దాటెయ్యగలను అనుకున్నాడు. సరిగ్గా ట్రాక్ దగ్గరకు వెళ్ళగానే బైక్ ట్రాక్ ఎక్కలేకపోయింది. దీంతో బైక్ పట్టాలమీద పడిపోయింది.. ఆ యువకుడు బైక్ నుంచి కింద పడి… లేచి మళ్ళీ బైక్ ను తీసుకుందామని ప్రయత్నించాడు.. ఇంతలో రైలు శరవేగంగా రావడం గమనించిన చుట్టుపక్కలవారు ఆ యువకుడిని అలెర్ట్ చేశారు.
వెంటనే ఆ యువకుడు బైక్ ను వదిలి పట్టాలకు దూరంగా పరిగెత్తాడు.. ట్రైన్ వచ్చి స్పీడ్ గా వెళ్ళింది.. ట్రైన్ కి ఉన్న పార్ట్స్.. బైక్ కు తగిలాయి.. బైక్ క్షణాల్లో ముక్కముక్కలయింది. అసలు అక్కడ బైక్ ఉంది అనడానికి ఆనవాలు కూడా మిగల్లేదు.. బైక్ క్రష్ అయ్యింది. దీంతో ఈ ప్రమాదం చూసిన వారు లక్కీగా ఆ యువకుడు అక్కడ నుంచి బయటపడ్డాడు… లేదంటే.. అతని పరిస్థితి ఏమయ్యేదో అనుకున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బస్తీ జిల్లా రైల్వే క్రాసింగ్ వద్ద జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రైళ్ల ప్రమాదాలు నివారించాలానే కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖా చాలా చోట్ల రైల్వే క్రాసింగ్స్ మూసివేస్తున్నాయి. అయినా మన భద్రత మన చేతుల్లోనే ఉంది. అప్రమత్తంగా ఉండడం అత్యవసరం ..
Also Read: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మళ్ళీ మ్యాన్ ఈటర్ సంచారం.. భయాందోళనలో ప్రజలు