PM Modi in Varanasi: కాశీలో రెండో రోజు కొనసాగుతున్న ప్రధాని మోడీ పర్యటన.. బీజేపీ పాలిత రాష్ట్ర సీఎంలతో కీలక భేటీ!

|

Dec 14, 2021 | 1:30 PM

ఉత్తరప్రదేశ్‌లో భారత ప్రధానమంత్రి మోడీ రెండోవ రోజు పర్యటిస్తున్నారు. వారణాసి పర్యటనలో భాగంగా నిన్న కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభించిన ప్రధాని మోడీ.. రెండో రోజైన మంగళవారం పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు

PM Modi in Varanasi: కాశీలో రెండో రోజు కొనసాగుతున్న ప్రధాని మోడీ పర్యటన.. బీజేపీ పాలిత రాష్ట్ర సీఎంలతో కీలక భేటీ!
Modi Meet Bjp Ruled States Cms
Follow us on

PM Modi in Varanasi Latest News: ఉత్తరప్రదేశ్‌లో భారత ప్రధానమంత్రి మోడీ రెండోవ రోజు పర్యటిస్తున్నారు. వారణాసి పర్యటనలో భాగంగా నిన్న కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభించిన ప్రధాని మోడీ.. రెండో రోజైన మంగళవారం పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ప్రధాన మంత్రి 12 భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అవుతున్నారు. ఈ సందర్భంగా పాలన సంబంధిత విషయాలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే, ఈరోజు సద్గురు సదాఫల్దియో విహంగం యోగ్ సంస్థాన్ 98వ వార్షికోత్సవ వేడుకలో మోడీ పాల్గొంటారు.

ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ప్రకారం, వారణాసిలోని మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే స్వర్వేద్ మహామందిర్‌లో సద్గురు సదాఫల్దీయో విహంగం యోగ్ సంస్థాన్ 98వ వార్షికోత్సవ వేడుకలకు ప్రధాని మోడీ హాజరవుతారు. అనంతరం అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో ప్రధాని సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి బీహార్, నాగాలాండ్ డిప్యూటీ సీఎంలు కూడా హాజరుకానున్నారు.

ఈ సమావేశం ముఖ్యంగా పాలనకు సంబంధించిన ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి అవకాశం కల్పిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీమ్ ఇండియా స్ఫూర్తిని పెంపొందించాలనే ప్రధాన మంత్రి దృష్టికి అనుగుణంగా ఉందని PMO తెలిపింది. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు మంగళవారం ఉదయం ప్రధాని మోడీ ముందు సుపరిపాలనపై ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు మంగళవారం కూడా కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించనున్నారు. ప్రధాని మోడీ ప్రస్తుతం తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు.

దాదాపు 339 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించిన కాశీ విశ్వనాథ్ ధామ్ మొదటి దశను ప్రధాని మోడీ తన పర్యటనలో మొదటి రోజు ప్రారంభించారు. సోమవారం ఉదయం 11 గంటలకు వారణాసికి చేరుకున్న తర్వాత, కాలభైరవ ఆలయంలో ప్రార్థనలు చేయడం ద్వారా ప్రధాని తన రోజును ప్రారంభించారు. ఆ తర్వాత ఖిర్కియా ఘాట్ నుంచి లలితా ఘాట్‌కు విహారయాత్రలో వెళ్లిన మోడీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించి, గంగానదిలో పుణ్యస్నానం చేశారు. అనంతరం ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాశీ విశ్వనాథ ధామ్‌ను ప్రారంభించారు. కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ నిర్మాణ పనుల్లో నిమగ్నమైన కార్మికులతో కలిసి ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి భోజనం చేశారు.

ఆ తర్వాత మధ్యాహ్నం లలితా ఘాట్‌ నుంచి రవిదాస్‌ ఘాట్‌ వరకు గంగా హారతిలో పాల్గొనేందుకు మోడీ బోటు షికారు చేశారు. అక్కడికి చేరుకోగానే ప్రధాని వివేకానంద క్రూజ్‌ ఎక్కారు. ప్రధాని నరేంద్ర మోడీ వెంట సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, బీజేపీ అగ్రనేతలు ఉన్నారు. వేలాది మట్టి దీపాలు, దీపాలు, పుష్పాలంకరణలతో ఘాట్‌ శోభాయమానంగా మారింది. గంగానది ఒడ్డున ‘గంగా హారతి’ కనుల పండుగ గా సాగింది. అనంతరం బీజేపీ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో ప్రధాని అధ్యక్షతన ఆరు గంటలపాటు సమావేశం జరిగింది. భేటీ అనంతరం వారణాసిలో కీలక అభివృద్ధి పనులను పరిశీలించిన మోడీ, బనారస్ రైల్వే స్టేషన్‌ను సందర్శించారు.

Read Also .. Omicron Variant: భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్‌.. ఇప్పటి వరకే ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..