కరోనా వైరస్ తో సతమతమవుతున్న ఇరాన్ దేశం నుంచి 58 మంది భారతీయులు క్షేమంగా ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ చేరుకున్నారు. భారత వైమానిక దళానికి చెందిన సీ-17 విమానంలో వీరంతా స్వదేశానికి చేరుకున్నట్టు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు.. ‘మిషన్ కంప్లీట్’ అని ఆయన ట్వీట్ చేశారు. ఇరాన్ లో వందలాది భారతీయులు చిక్కుబడి ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ దేశంలో కరోనాకు గురై మరణించినవారి సంఖ్య 200 కు పెరిగింది. ఆ దేశం నుంచి భారతీయులను ఇక్కడికి చేర్చడం ఇది రెండోసారి. కాగా-గత నెల 27 న చైనా లోని వూహాన్ సిటీ నుంచి 76 మంది భారతీయులను భారత విమానంలో స్వదేశానికి చేర్చారు.