Donations for Ram Mandir: అయోధ్య రామమందిరానికి విరాళాలు అందజేసిన ముస్లింలు, క్రైస్తవ కమిటీ సభ్యులు..

|

Feb 08, 2021 | 3:06 AM

Donations for Ram Mandir: అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి విరాళాలు పోటెత్తుతున్నాయి. ఆ మతం, ఇ మతం అని..

Donations for Ram Mandir: అయోధ్య రామమందిరానికి విరాళాలు అందజేసిన ముస్లింలు, క్రైస్తవ కమిటీ సభ్యులు..
Follow us on

Donations for Ram Mandir: అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి విరాళాలు పోటెత్తుతున్నాయి. ఆ మతం, ఈ మతం అని తేడా లేకుండా అన్ని మతాలకు చెందిన ప్రజలు రామాలయం నిర్మాణం కోసం తమ వంతు సాయం అందజేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌కు చెందిన ఓ ముస్లిం కుటుంబం రామాలయ నిర్మాణానికి తమ వంతు సాయంగా విరాళాలు అందజేసింది. ఫైజాబాద్‌లోని రామ్ భవన్‌లో సంబంధిత విరాళం సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా రామ్ భవన్‌ నిర్వాహకులు సదరు ముస్లిం కుటుంబ సభ్యులను సన్మానించారు. వారిని అభినందించారు. కాగా, ‘మనమంతా హిందుస్థానీలం. మన మతాలు వేరు కావొచ్చు కానీ, మన ప్రాంతాలు వేరు కాదు. బయటి దేశం నుండి ఏం రాలేదు. మన పూర్వీకులు ఈ గడ్డపైనే పుట్టారు. హిందూ, ముస్లింలు అంతా సోదరభావంగా కలిసి మెలసి ఉన్నాం’ అని విరాళం ఇచ్చిన ముస్లిం కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ఇదిలాఉండగా, బెంగళూరులోనూ కొందరు క్రైస్తవులు అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం భారీగా విరాళాలు ఇచ్చారు. క్రైస్తవ సముదాయానికి చెందిన పారిశ్రామికవేత్తలు, విద్యా నిపుణులు రూ. కోటి విరాళం ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్థనారాయణకు అందజేశారు.