ఇలా తయారయ్యారేంట్రా.. ఫ్రెండ్‌ను కాల్చి చంపి.. సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్‌.. కట్‌చేస్తే..

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఫ్రెండ్‌ను గన్‌తో కాల్చి చంపి.. అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు ఒక యువకుడు.. ఇది కాస్తా వైరల్‌గా మారి పోలీసుల దృష్టికి చేరడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇలా తయారయ్యారేంట్రా.. ఫ్రెండ్‌ను కాల్చి చంపి.. సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్‌.. కట్‌చేస్తే..
Up News

Updated on: Oct 03, 2025 | 7:14 PM

ఒక యువకుడు తన స్నేహితుడిని కాల్చి చంపి ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో వెలుగు చూసింది.ఇది కాస్తా వైరల్‌గా మారి పోలీసుల దృష్టికి చేరడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వైరల్‌ అవుతున్న వీడియోలో అదిల్‌ అనే యువకుడిపై ఒక యువకుడు మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. అందుకు సంబంధించిన దృశ్యాలను తన మొబైల్‌లో రికార్డ్ చేసుకొని అక్కడి నుంచి బైక్‌పై పారిపోయాడు. ఆ తర్వాత ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. 11 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో క్షణాల్లో వైరగా మారింది. ఈ వీడియో చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఇక ఈ వీడియోపై స్పందించిన పోలీసులు.. రంగంలోకి దిగారు. ఇంతకు ఆ వీడియో ఉన్న వ్యక్తి నిజంగానే చనిపోయాడా, లేదా స్పృహకోల్పోయి ఉన్నాడా, చనిపోతే.. అని మృతదేహం ఎక్కడుందనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఈ వీడియో చూసి బాధితుడి అదిల్‌ కుటుంబ సభ్యులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు అనుమానం ఉన్న ఆరుగురి పేర్లను పోలీసుకు తెలిపారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇలాంటి ఘటన జరగడం రాష్ట్రంలో ఇదే తొలిసారని పోలీసులు చెబుతున్నారు. ఇది నిజంగానే హత్య అయితే అసలు అదిల్‌ను ఆ యువకుడు ఎందుకు చంపాడు. వీడియో తీసి దాన్ని ఎందుకు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. దీని వెనక ఏవైనా కారణాలు ఉన్నాయా?అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.