
Abortion Bill India: మెడికల్ టెర్నినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (అబార్షన్) సవరణ బిల్లుకు మంగళవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రవేశ పెట్టిన దాదాపు ఏడాది తర్వాత ఆమోదం లభించడం విశేషం. ఇదిలా ఉంటే గతంలో 1971 నాటి చట్టానికి సవరణ చేస్తూ అబార్షన్ (సవరణ) బిల్లు 2020ను పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్.. ‘గర్భాన్ని సులువుగా తొలగించడంతో పాటు మహిళలకు పునరుత్పత్తి హక్కులను కల్పించేందుకు ఈ బిల్లు తోడ్పడుతుందని’ చెప్పారు.
ఇంతకు ముందు అమల్లో ఉన్న చట్టం ఆధారంగా ఒక మహిళ గర్భం దాల్చిన 20 వారాల వరకు అబార్షన్ చేసుకునే అవకాశం కల్పించారు. కానీ తాజాగా చేసిన సవరణతో గర్భస్రావం పరిమితిని 24 వారాలకు పెంచడానికి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బిల్లు అందిస్తుంది. ముఖ్యంగా ఈ బిల్లు ద్వారా అత్యాచార బాధితులు, వికలాంగ మహిళలకు న్యాయం జరుగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రకాశ్ జావడేకర్ ఈ బిల్లును ప్రగతిశీల సంస్కరణంగా అభివర్ణించారు. దీనివల్ల మాతా మరణాలు కూడా తగ్గుతాయని ఆయన తెలిపారు. ఇక 24 వారాల తర్వాత ఏవైనా అనివార్య కారణాల వల్ల అబార్షన్ చేయాల్సి వస్తే రాష్ట్ర స్థాయి మెడికల్ బోర్డు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఈ సవరణ బిల్లులో పేర్కొన్నారు. ఇక ఈ బిల్లుతో మహిళల గోప్యతకు గౌరవం ఇస్తుందని అభిప్రాయపడుతున్నారు.
Rajya Sabha passes The Medical Termination of Pregnancy (Amendment) Bill, 2020.
Bill extends limit of medical termination of pregnancy to 24 weeks with opinion of two registered medical practitioners. It also aims to ensure confidentiality of process & respects privacy of women. pic.twitter.com/ueKrLvPZFB
— All India Radio News (@airnewsalerts) March 16, 2021