
పంజాబ్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో ముసుగు ధరించిన కొందరు దుండగులు చేతిలో తుపాకులు పట్టుకుని హల్‌చల్ చేశారు. తుపాకీతో మెడికల్ షాపులోకి ప్రవేశించిన దుండగులు.. మెడికల్ షాప్ యజమాని నుండి రూ.40,000 నగదును దోచుకున్నారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో చిక్కాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. సీసీటీవీ ఫుటేజీలో ముసుగులు ధరించిన వ్యక్తులు సాధారణ కస్టమర్లుగా దుకాణంలోకి ప్రవేశించారు. ఏమీ ఎరగనట్టుగానే మొదట మందులు అడిగారు. అదును చూసి అందినకాడికి దోచుకుని పరారయ్యారు.
షాప్‌లో జరిగిన లూటీ దృశ్యాలు మొత్తం దుకాణంలోని సీసీ కెమెరాలో రికార్డైంది. ముగ్గురు వ్యక్తులు మెడికల్ షాప్‌లోకి ప్రవేశించారు. వారిలో ఒకడు షాప్ ఓనర్‌కు తుపాకీ గురిపెట్టాడు. మరో వ్యక్తి షాప్ ఓనర్‌తోపాటు ఉన్న ఇంకో వ్యక్తి ఒడిసిపట్టుకున్నాడు. మరో వ్యక్తి క్యాష్ కౌంటర్ ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బు మొత్తం రూ.40 వేలు తీసుకున్నాడు. అనంతరం ముగ్గురూ కలిసి అక్కడి నుంచి పారిపోయారు.
దుండగుల దాడికి భయపడిపోయిన దుకాణ యజమాని చేసేది లేక చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..