Manipur: ఆర్మీ వాహనంపై ముష్కరుల దాడి.. ఇద్దరు జవాన్లు మృతి!

మణిపూర్‌ రాజధాని ఇంపాల్‌లో దారుణం ఘటన వెలుగు చూసింది. అస్సాం రైఫిల్స్‌కు చెందిన వాహనంపై కొందరు గుర్తుతెలియన వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఇంఫాల్‌లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS)కి తరలించారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగినట్టు తెలుస్తోంది.

Manipur: ఆర్మీ వాహనంపై ముష్కరుల దాడి.. ఇద్దరు జవాన్లు మృతి!
Manipur Firings

Updated on: Sep 19, 2025 | 9:19 PM

మణిపూర్‌ రాజధాని ఇంపాల్‌లో దారుణం ఘటన వెలుగు చూసింది. అస్సాం రైఫిల్స్‌కు చెందిన వాహనంపై కొందరు గుర్తుతెలియన వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఇంఫాల్‌ నుంచి బిష్ణుపూర్‌కు శుక్రవారం సాయంత్రం పారామిలిటరీ దళాల 407 టాటా వాహనం బయల్దేరాయి. వారు ప్రయాణిస్తున్న వాహనం నంబోల్ సబెల్ లీకాయ్ ప్రాంతంలోకి రాగానే కొందరు గుర్తు తెలియని ముష్కరులు సైనికుల వాహనంపై కాల్పులు జరపడం స్టార్ట్ చేశారు. తమ దగ్గర ఉన్న తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు.

ఈ ముష్కరుల దాడిలో సుమారు అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఇద్దరు సిబ్బంది అమరులయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఇంఫాల్‌లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS)కి తరలించారు. ప్రస్తుతం వారకి అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని భారత సైన్యం ఒక అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది.

వీడియో చూడండి..

అయితే ప్రస్తుతానికి, ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. సైనికులపై ఈ దాడికి పాల్పడిన సాయుధ వ్యక్తులను పట్టుకోవడానికి ఆర్మీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ ఘటనపై మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా స్పందించారు. ఆయన ఈ దాడిని ఖండిస్తూ, విధి నిర్వహణలో మరణించిన సైనికుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి