బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హత్యకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు కోల్‌కతా పోలీసులు తెలిపారు. మూడంచెల భద్రతను తప్పించుకుని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంట్లోకి ప్రవేశించడం బెంగాల్‌లో సంచలనం సృష్టించింది. మమతా ఇంటి వద్ద ఉగ్రవాది ఏడు సార్లు రెక్కీ నిర్వహించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోల్‌కతాలోని కాళీఘాట్ ప్రాంతంలోని మమత ఇంటి వద్ద ఉగ్రవాది హఫీజుల్ మొల్లా రెక్కీ నిర్వహించాడు. జూలై నెల 2, 3 తేదీల మధ్య రాత్రి హఫీజుల్.. సీఎం ఇంట్లోని భద్రతా సిబ్బందిని దాటి ఇంట్లోకి ఇనుపరాడ్‌తో ప్రవేశించడాన్ని పోలీసులు గుర్తించారని చెప్పారు. ఈ క్రమంలో మమతా బెనర్జీ కదలికపై ఫోకస్ పెట్టాడు. ఈ విషయాన్ని భద్రతా సిబ్బంది గుర్తించి ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, విచారణలో భాగంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన సెల్‌ఫోన్‌తో మమత నివాసాన్ని ఫొటోలు తీశారని పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి 11 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కాగా సీఎం సెక్యూరిటీ డైరెక్టర్ వివేక్ సహాయ్‌ను పదవి నుంచి తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం.