హోటల్‌ గదిలో దిగారా? సీక్రెట్ కెమెరాలు ఇక్కడ కూడా ఉంటాయి జాగ్రత్త

ఎప్పుడైనా.. విహార యాత్రలకు, పని మీద దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు సాధారణంగా హోటళ్లలో స్టే చేస్తూంటారు. అనంతరం పని ముగిసిన తరువాత తిరిగి మన ప్రాంతానికి చేరుకుంటాం. అంతా బాగా జరిగింది కాదా.. అని అనుకుంటే పొరపాటే. ఈ సారి హోటల్ రూమ్స్‌కి వెళ్లినప్పుడు..

  • Tv9 Telugu
  • Publish Date - 2:03 pm, Fri, 13 March 20
హోటల్‌ గదిలో దిగారా? సీక్రెట్ కెమెరాలు ఇక్కడ కూడా ఉంటాయి జాగ్రత్త

ఎప్పుడైనా.. విహార యాత్రలకు, పని మీద దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు సాధారణంగా హోటళ్లలో స్టే చేస్తూంటారు. అనంతరం పని ముగిసిన తరువాత తిరిగి మన ప్రాంతానికి చేరుకుంటాం. అంతా బాగా జరిగింది కాదా.. అని అనుకుంటే పొరపాటే. ఈ సారి హోటల్ రూమ్స్‌కి వెళ్లినప్పుడు నిశితంగా పరిశీలించండి. ఎక్కడో ఓ చోట సీక్రెట్ కెమెరాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఇటీవలే మహాబలేశ్వర్‌లోని బడ్జెట్ హోటల్‌ నుంచి పోలీసులు ఎల్‌ఈడీ బల్బ్‌లో ఫిక్స్ చేసిన ఓ సీక్రెట్ కెమెరాను సీజ్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. బడ్జెట్ హోటల్‌లో దిగిన ఓ ప్రయాణికుడు కెమెరా ఉన్నట్లు అనుమానించడంతో ఈ విషయం బయటపడింది. ఈ విషయంపై హోటల్ సిబ్బందిని నిలదీయడంతో వారు బెదిరింపులకు దిగారు. దీంతో ఆ ప్రయాణికుడు మహారాష్ట్ర పోలీసులకు ట్విట్టర్‌లో ఈ విషయాన్ని తెలిపి ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన పోలీసులు.. వెంటనే ఈ ఘటనపై స్పందించారు. కేసు నమోదు చేసుకుని.. విచారణ చేస్తున్నారు. అయితే హోటల్ నిర్వాహకులు మాత్రం.. మా భద్రత కోసమే ఇలా చేశామని చెబుతున్నారు.

Read More this also: రోజా ‘రచ్చబండ’కు దొరబాబు దంపతులు

షాకింగ్ న్యూస్: ఆస్ట్రేలియా క్రికెటర్‌కి కరోనా వైరస్..!

వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చూడాలనుకుంటున్నారా? ఈ ట్రిక్ యూజ్ చేయండి