నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ను స్మరిస్తూ దీదీ ట్వీట్‌

| Edited By:

Aug 18, 2020 | 5:00 PM

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ను స్మరిస్తూ ట్వీట్ చేశారు. 1945లో ఇదే రోజున ఆయన ఆచూకీ లేకుండా పోయిందంటూ ఉద్వేగభరి ట్వీట్ చేశారు. ఆయన ఈ భూమి పుత్రుడని..

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ను స్మరిస్తూ దీదీ ట్వీట్‌
Follow us on

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ను స్మరిస్తూ ట్వీట్ చేశారు. 1945లో ఇదే రోజున ఆయన ఆచూకీ లేకుండా పోయిందంటూ ఉద్వేగభరి ట్వీట్ చేశారు. ఆయన ఈ భూమి పుత్రుడని పేర్కొన్నారు. తైవాన్‌లోని టైహోకు విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆయన తిరిగి రాలేదని.. అలానే కరుమరుగైపోయారన్నారు. ఇప్పటి వరకు కూడా ఆయనకు ఏమైందన్న విషయం తెలియదని.. నేతాజీ ఈ నేలకు చెందిన గొప్ప వీరుడంటూ పేర్కొంటూ.. ఆయన గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతిపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. 1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మృతిచెందారని ప్రకటించినప్పటికీ.. ప్రమాదం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్ళారంటూ అనేకమంది నమ్ముతారు.

Read More :

మేఘాలయకు బదిలీ అయిన గోవా గవర్నర్

బ్రెజిల్‌లో 33 లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు