Watch Video: ఇవే తగ్గించుకోమనేది.. నడిరోడ్డుపై కారుపై ఎక్కి విన్యాసాలు.. బెడిసికొట్టిన స్టంట్!

రోడ్లపై కార్లు, బైక్‌లతో స్టంట్స్ చేయడం యూత్‌లో ఫ్యాషన్ అయిపోయింది. ఇలా స్టంట్స్ చేస్తూ చాలా మంది యువత ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలానే రోడ్డుపై మహింద్రా కారుపై నిలబడి స్టంట్స్ చేస్తూ హంగామా చేశారు కొందరు యువకులు.. డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో అందరూ ఒక్కసారిగా బొక్క బోర్లా పడిపోయారు.

Watch Video: ఇవే తగ్గించుకోమనేది.. నడిరోడ్డుపై కారుపై ఎక్కి విన్యాసాలు.. బెడిసికొట్టిన స్టంట్!
Car Stunt Video

Updated on: Nov 22, 2025 | 11:23 AM

మహింద్రా థార్ కారుపై నిలబడి రోడ్డుపై స్టంట్స్ చేసేందుకు ప్రయత్నించి కొందరు యువకులు బొక్క బోర్లా పడ్డారు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని నుహ్ జిల్లాలో ముగ్గురు యువకులు రోడ్డుపై మహీంద్రా థార్ కారుతో విన్యాసాలు చేశారు. కారు పైకప్పుపై ప్రమాదకరంగా కూర్చొని ప్రయాణించారు. అయితే ముందు లారీ రావడంతో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేసి ముందుకు సాగాడు.. దీంతో కారుపై ఉన్న ముగ్గురు యువకులు ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయారు. .

అది గమనించిన డ్రైవర్ వెంటనే కారును ఆపేశాడు.దీంతో ఘోర ప్రమాదాన్ని తృటిలో తప్పింది. డ్రైవర్ అప్రమత్తతతో కారుపై ఉన్న యువకులు.. దాని టైర్ల కింద పడకుండా తప్పించుకున్నారు. కానీ కారుపై నుంచి పడిపోవడంతో వారిలో కొందరు గాయపడ్డారు. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఇందుకు సంబంధించిన వీడియోలను రికార్డ్ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు యువకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్లపై ఇలాంటి విన్యాసాలను అరికట్టాలని పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..ఈ ప్రాంతంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వాటిని అమలు చేయట్లేదని నివాసితులు ఆరోపిస్తున్నారు.

ఇక ఈ వీడియో పోలీసులు దృష్టికి వెళ్లడంతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఒక పోలీసు అధికారి తెలిపాడు. ఇటువంటి నిర్లక్ష్య చర్యలకు పాల్పడే వాహనాలను గుర్తించి, చలాన్లు జారీ చేయాలని, జిల్లాలోకి ప్రవేశించే మోడిఫైడ్ SUV లను ట్రాక్ చేయాలని, మొత్తం పర్యవేక్షణను కఠినతరం చేయాలని ట్రాఫిక్ పోలీసులు, స్థానిక స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు అధికారులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us