థానే: దేశవ్యాప్తంగా టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో గృహిణులు ఆచితూచి టమాటాలను వినియోగిస్తున్నారు. కేవలం నెల రోజుల్లోనే కేజీ టమాట ధర రూ.20 నుంచి రూ.160కి చేరింది. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఏకంగా రూ.200 మార్కునుకూడా దాటేసింది. దీంతో టమాటాలు కూడా విలువైన వస్తువుల జాబితాలో చేరిపోయాయి. ఒకప్పుడు పెళ్లిళ్లు, ఫంక్షన్లకు విలువైన వస్తువులను బహుమతులుగా ఇచ్చేవారు. ఇప్పుడు టమాటాలను బహుమతులుగా ఇచ్చిపుచ్చుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఓ మహిళ పుట్టిన రోజు వేడుకలకు టమాటాలను గిఫ్ట్‌గా ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
మహారాష్ట్రలోని కళ్యాణ్‌లోని కొచ్చాడి ప్రాంతానికి చెందిన సోనాల్ బోర్స్ అనే మహిళ ఆదివారం (జులై 9) నాడు తన పుట్టిన రోజు జరుపుకుంది. దీంతో ఆమె ఇంట్లో చిన్న బర్త్ డే పార్టీ జరిగింది. అతని సోదరుడు గౌతమ్ వాఘ్, అత్తామామలు 4 కిలోల టమాటాలను ఓ బుట్టలో తీసుకొచ్చి బహుమతిగా ఇచ్చారు. గిఫ్ట్‌గా వచ్చిన టమాటాలను చుట్టూ పెట్టుకుని సోనాల్ కేక్ కట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టమాటాలను బహుమతిగా అందుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఇంతకంటే మంచి బహుమతి ఇంకేం ఉంటుందని సోనాల్ ఆనందం వ్యక్తం చేసింది.
థానేలోని వాగ్లే ఎస్టేట్‌కు చెందిన కిరణ్ సింగ్ అనే గృహిణి కూడా ఆగస్టు 15 తన పుట్టిన రోజులోపు టమాటాల ధరలు తగ్గకపోతే, నేను కూడా నా భర్త, బంధువులు, స్నేహితుల నుంచి టమోటాలే బహుమతిగా రావాలని ఆశిస్తున్నాని చెప్పుకొచ్చింది. ఏదిఏమైనా టమాటా ధరలు కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.