
భారత ప్రధాని నరేంద్ర మోదీ బర్త్ డే తో పాటు ఆయన 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవా ప్రస్థానం పూర్తయిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రముఖులు, యువ నాయకుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తనయుడు మహాన్ ఆర్యమన్ సింధియా ప్రధాని మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానితో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంటూ ఆయన ప్రత్యేక సందేశాన్ని రాసుకొచ్చారు.
“దేశానికి విశిష్ట సేవలందిస్తున్న గౌరవనీయ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. దేశ సేవ అనే మార్గంలో ఏమాత్రం అలసట లేకుండా, నిరంతరం ముందుకు సాగడానికి మీ జీవితం ప్రతి భారతీయుడికీ గొప్ప స్ఫూర్తి. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, దీర్ఘాయువును ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.” అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Mahanaaryaman Scindia