Viral Video: మద్యం మత్తులో యువతుల వీరంగం .. న‌డిరోడ్డుపై అందరూ చూస్తుండగానే అమ్మాయిలు హల్‌చల్‌..

అమ్మాయిలు తాగిన మైకంలో పోలీసు స్టేషన్‌లోనూ గంటకు పైగా వీరంగం సృష్టించారు. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Viral Video: మద్యం మత్తులో యువతుల వీరంగం .. న‌డిరోడ్డుపై అందరూ చూస్తుండగానే అమ్మాయిలు హల్‌చల్‌..
Drunk Girls Fight

Updated on: Dec 13, 2022 | 8:59 PM

తాగిన మత్తులో అర్ధరాత్రి ఇద్దరు అమ్మాయిలు నడిరోడ్డుపై హల్‌చల్‌ చేశారు. ఇరువురు పరస్పరం గొడవపడుతూ వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఇద్దరు అమ్మాయిలు పరస్పరం రెచ్చిపోయి గొడవపడ్డారు. మరో ఇద్దరు అమ్మాయిలు వారిని విడిపించటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ జిల్లాలో జరిగింది. నడిరోడ్డుపై నలుగురు యువతులు చేసిన హంగామనంతా స్థానికులు కొందరు వీడియోలు తీశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మద్యం మత్తులో మార్గమధ్యలో గొడవకు దిగిన ఇద్దరు బాలికలను అరెస్టు చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఇద్దరు అమ్మాయిలు మార్గమధ్యంలో గొడవపడుతుండగా, మిగతా ఇద్దరు అమ్మాయిలు ఒకరి నుంచి ఒకరిని విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు ఇండోర్ వీధుల్లో అర్థరాత్రి వరకు హంగామా సృష్టించారు. మద్యం మత్తులో యువతులు గొడవపడుతుండగా స్థానికులు వీడియో తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికలను అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

అందిన సమాచారం మేరకు అమ్మాయిలు తాగిన మైకంలో పోలీసు స్టేషన్‌లోనూ గంటకు పైగా వీరంగం సృష్టించారు. ఇండోర్‌లో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి