ప్రేమించింది.. పెళ్లి కూడా చేసుకుంది! కానీ, 15 రోజులకే ప్రియుడికి ఊహించని షాకిస్తూ..

ఫాసియా, నాగార్జున అనే తెలుగు జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి విభిన్న మతాల కారణంగా కుటుంబాలు వ్యతిరేకించాయి. పారిపోయి పెళ్లి చేసుకున్న తర్వాత 15 రోజుల్లోనే ఫాసియా తల్లి ఆరోగ్యం కారణంగా తన భర్తను వదిలి వెళ్లిపోయింది. ఈ సంఘటన నాగార్జునకు షాక్‌నిచ్చింది.

ప్రేమించింది.. పెళ్లి కూడా చేసుకుంది! కానీ, 15 రోజులకే ప్రియుడికి ఊహించని షాకిస్తూ..
Love Marriage

Updated on: Apr 07, 2025 | 6:53 PM

ఓ అమ్మాయి, అబ్బాయి రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దలు వారి ప్రేమను అంగీకరించకపోవడంతో పారిపోయి పెళ్లి కూడా చేసుకున్నారు. ఓ 15 రోజుల కాపురం తర్వాత.. ఆ అమ్మాయి, యువకుడికి ఊహించని షాకిచ్చింది. చిక్కబళ్లాపుర తాలూకాలోని మైలపనహళ్లి గ్రామానికి చెందిన ఫాసియా, నాగార్జున ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇద్దరి మతాలు వేరు కావడంతో పెద్దలు వీరి ప్రేమను ఒప్పుకోలేదు, పెళ్లికి అనుమతించలేదు. దీంతో ఇద్దరు పారిపోయి మార్చి 24న వివాహం చేసుకున్నారు.

ఆ తర్వాత పెద్దల నుంచి తమకు భద్రత కావాలని చిక్కబళ్లాపూర్ గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులను పిలిపించి, ముందుగా యువతి, యువకులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఆ తర్వాత అమ్మాయి తల్లిదండ్రులను వారి కూతురితో మాట్లాడుకునే అనుమతి కూడా ఇచ్చారు. వాళ్లు ఎంత బతిమిలాడినా.. ఆ యువకుడితోనే ఉంటానంటూ కరాఖండిగా చెప్పేసింది. దీంతో చేసేదేం లేక పోలీసులు.. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇచ్చా.. అమ్మాయిని ఆ అబ్బాయితోనే పంపేశారు.

తీరా 15 రోజులు గడిచాయో లేదో ఫాసియా తన తల్లి ఇంటికి తిరిగి వెళ్లిపోయింది. తాను ఇలా పెళ్లి చేసుకోవడంతో తన తల్లి అనారోగ్యం పాలైందని తెలుసుకున్న ఫాసియా భర్తను వదిలేసి.. తల్లి చెంతకు చేరింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి, నిండు నూరేళ్లు తనతోనే ఉంటానని చెప్పిన ఆమె ఇప్పుడు ఇలా వదిలేసి వెళ్లిపోవడంతో నాగార్జున షాక్‌ అయ్యాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.