
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయ్ పై బూటు విసిరిన న్యాయవాదిలో ఎలాంటి మార్పులేదు. తాను చేసిన పనికి పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదు లాయర్ రాకేశ్ కిశోర్.. జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలు తనను బాధించాయని.. ఈ దాడిని సమర్ధించుకున్నాడు కిశోర్.. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయ్ పై బూటు విసిరేందుకు ప్రయత్నించిన తర్వాత సస్పెండ్ అయిన న్యాయవాది రాకేష్ కిషోర్.. మంగళవారం మాట్లాడుతూ.. ఈ ఘటన పట్ల పశ్చాత్తాపం చెందడంలేదు.. అంటూ పేర్కొన్నాడు.. “సెప్టెంబర్ 16న CJI కోర్టులో ఒక PIL దాఖలు చేయబడింది. CJI దానిని ఎగతాళి చేస్తూ – వెళ్లి విగ్రహాన్ని ప్రార్థించి, దాని తలని పునరుద్ధరించమని చెప్పు… మన సనాతన ధర్మానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు, SC అలాంటి ఆదేశాలను జారీ చేస్తుంది. పిటిషనర్‌కు ఉపశమనం కలిగించవద్దు, కానీ, అతనిని కూడా ఎగతాళి చేయవద్దు… నేను బాధపడ్డాను… నేను తాగి మత్తులో లేను; అతని చర్యకు ఇది నా ప్రతిచర్య… నేను భయపడను. జరిగిన దానికి నేను చింతించడం లేదు” అని రాకేష్ కిషోర్ వార్తా సంస్థ ANIకి తెలిపారు.
మధ్యప్రదేశ్ లోని జవారి ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్దరించాలి కోరుతూ వేసిన పిటిషన్‌ను సెప్టెబర్ 16న సీజేఐ తోసిపుచ్చారు. ఇది కచ్చితంగా పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని , ఏదైనా చేయమని దేవుడినే వెళ్లి అడగండి. ఇది చేస్తే మీరు విష్ణువుకు మంచి భక్తుడనిపించుకుంటారు. దేవుడిని ప్రార్థించి, మెడిటేషన్ చేయండి’ అని సీజేఐ అన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై తాను రగిలిపోయినట్లు సస్పైండన న్యాయవాది రాకేష్ కిషోర్ చెబుతున్నారు. ప్రధాన న్యాయమూర్తి వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదన్నారు. అందుకే తాను దాడిచేసినట్లు ఆయన చెప్పారు. తాను భయపడే ప్రసక్తే లేదన్నారు.
#WATCH | Delhi: Suspended Advocate Rakesh Kishore, who attempted to hurl an object at CJI BR Gavai, says, “…I was hurt…I was not inebriated, this was my reaction to his action…I am not fearful. I don’t regret what happened.”
“A PIL was filed in the Court of CJI on 16th… pic.twitter.com/6h4S47NxMd
— ANI (@ANI) October 7, 2025
అంతేకాకుండా.. ఈ దేశం బుల్డోజర్లతో నడవదంటూ మారిషస్‌లో చీఫ్ జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలను కూడా రాకేష్ కిషోర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు యూపీ సీఎం యోగి బుల్డోజర్ యాక్షన్ తప్పు ఎలా అవుతుందని ఆయన వాదిస్తున్నారు. అలాంటి చర్యలను సుప్రీంకోర్టు అడ్డుకోవడం ఏంటంటూ కిషోర్ పేర్కొన్నాడు.
సీజేఐ గవాయ్‌పై దాడిని దాడిని ప్రధాని మోదీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. సీజేఐపై దాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా లాయర్లు ఆందోళన చేపట్టారు. ఢిల్లీ, కోయంబత్తూరు, ముంబైలో లాయర్లు నిరసనకు దిగారు. సీజేఐ గవాయ్‌పై దాడి చేసిన రాకేశ్ కిశోర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని , కఠినంగా శిక్షించాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్ర లోని బారామతిలో ఎన్సీపీ పవార్ వర్గం నేతలు జస్టిస్ గవాయ్‌కు మద్దతుగా ఆందోళన చేపట్టారు. రాకేశ్ కిశోర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఎంపీ సుప్రియా సూలే డిమాండ్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..