పాజిటివ్‌ వచ్చి లక్షణాలు లేకుంటే పనిలోకి వెళ్లొచ్చు

| Edited By:

Sep 16, 2020 | 5:46 PM

లాక్‌డౌన్ సడలింపుల తరువాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే రికవరీ రేటు ఎక్కువగా ఉండటంతో

పాజిటివ్‌ వచ్చి లక్షణాలు లేకుంటే పనిలోకి వెళ్లొచ్చు
Follow us on

Kerala Government  News: లాక్‌డౌన్ సడలింపుల తరువాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే రికవరీ రేటు ఎక్కువగా ఉండటంతో.. పలు రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని సడలింపులు ఇస్తున్నాయి. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాజిటివ్ వచ్చి లక్షణాలు లేకుంటే వలస కూలీలు పనిలోకి వెళ్లొచ్చని తెలిపింది. ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ సత్యజిత్‌ రాజన్‌ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేశారు. ప్రస్తుతమున్న క్వారంటైన్ రూల్స్ వలన రాష్ట్రంలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ల నిర్మాణం విషయంలో జాప్యం జరుగుతోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వలసకూలీలకు కొత్త మార్గదర్శకాలివే:
1.కొన్ని రోజుల పనిమీద కేరళలోకి వచ్చే వారు(వలస కార్మికులు) 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాలి.
2.కరోనా సర్టిఫికేట్ లేకుండా వస్తే వారు ఐదో రోజు పరీక్ష చేయించుకోవాలి. పరీక్షలకు అయ్యే ఖర్చు సంబంధిత కాంట్రాక్టర్ పెట్టుకోవాలి.
3.పాజిటివ్ వచ్చిన వారిని వేరుగా ఉంచాలి. ఒకవేళ వారికి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి తరలించాలి.
4. పాజిటివ్ వచ్చి ఎలాంటి లక్షణాలు లేకపోతే వారు పనుల్లోకి వెళ్లొచ్చు. అయితే పని స్థలంలో వారిని మిగిలిన వారితో కలవకుండా చూడాలి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వారికి వసతి సౌకర్యాలు, ఆహారం అందించాలి. ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ ఈ బాధ్యతలను తీసుకోవాలి.
5.బయటి నుంచి పనిమీద వచ్చే కార్మికులు కచ్చితంగా జగ్రత పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

Read More:

తాప్సీకి బంపరాఫర్‌.. కింగ్‌ఖాన్‌తో జోడీ..!

దీపావళికి ‘లక్ష్మీ బాంబ్’.. ఎలా పేలుతుందో..!