Baba Ramdev : యోగా గురు బాబా రాందేవ్‌పై అరెస్ట్‌ వారెంట్‌

యోగా గురువు, పతంజలి సంస్థ ఫౌండర్ రాందేవ్‌ బాబా, సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణకు కేరళ హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్‌ వారెంట్ జారీ చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు ప్రచారాల కేసులో విచారణకు హజరుకాకపోవడంతో.. న్యాయస్థానం వారికి నాన్ బెయిలబుల్ అరెస్ట్‌ వారెంట్ ఇచ్చింది.

Baba Ramdev : యోగా గురు బాబా రాందేవ్‌పై అరెస్ట్‌ వారెంట్‌
Acharya Balkrishna - Baba Ramdev

Updated on: Feb 02, 2025 | 2:39 PM

యోగా గురు బాబా రాందేవ్‌ మరోసారి కోర్టు చిక్కుల్లో ఇరుక్కున్నారు. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల తప్పుడు ప్రచారం కేసులో ఆయనకు కేరళ హైకోర్టు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ను జారీ చేసింది. పతంజలి సంస్థ ఎండీ బాలకృష్ణపై కూడా అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయ్యింది. దివ్య ఫార్మసీ ఉత్పత్తులపై ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు విడుదల చేశారని పాలక్కాడ్‌ జిల్లా కోర్టులో రాందేవ్‌తో పాటు బాలకృష్ణపై కేసు నమోదయ్యింది.

అయితే ఫిబ్రవరి 1వ తేదీన కోర్టు ముందు హాజరుకావాలని ఇద్దరికి నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. కాని ఇద్దరు కూడా విచారణకు హాజరుకాలేదు. దీంతో రాందేవ్‌తో పాటు బాలకృష్ణపై అరెస్ట్‌ వారెంట్‌లు జారీ అయ్యాయి. తప్పుడు యాడ్స్‌ ఆరోపణలపై ఇప్పటికే పతంజలికి చెందిన 10 ఉత్పత్తుల లైసెన్స్‌లు రద్దు అయ్యాయి. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో సీరియస్‌ అయ్యింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాందేవ్‌ బహిరంగ క్షమాపణలు కూడా చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..