చికెన్‌ విషయంలో గొడవ.. రక్తాలొచ్చేలా కొట్టుకున్న కస్టమర్, రెస్టారెంట్‌ సిబ్బంది.. అసలు ఏం జరిగిందంటే?

చికెన్ ఫ్రై ఆర్డర్ విషయంలో కస్టమర్‌, రెస్టారెంట్‌ సిబ్బందికి మధ్య మొదలైన చిన్న వివాదం చినికి చినికి గాలివనగా మారింది. మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ దాడిలో కష్టమర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చికెన్‌ విషయంలో గొడవ.. రక్తాలొచ్చేలా కొట్టుకున్న కస్టమర్, రెస్టారెంట్‌ సిబ్బంది.. అసలు ఏం జరిగిందంటే?
Kerala News

Updated on: Sep 29, 2025 | 6:47 PM

చికెన్ ఫ్రై ఆర్డర్ విషయంలో కస్టమర్‌, రెస్టారెంట్‌ సిబ్బందికి మధ్య చిన్నగా మొదలైన వివాదం చివరకు దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ దాడిలో కస్టమర్ తీవ్రంగా గాయపడగా.. రెస్టారెంట్‌ సిబ్బంది అక్కడి నుంచి పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కేరళలోని ఎట్టుమనూరు పట్టణంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

తిరువాంచూరుకు చెందిన 34 ఏళ్ల నిధిన్ అనే వ్యక్తి ఎట్టుమనూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అతనికి బాగా ఆకలివేయడంతో ఏదైనా తిందామని పక్కనే ఉన్న రెస్టారెంట్‌లోకి వెళ్లాడు. ఒక చికెన్ ఫ్రైతోపాటు పరోట్టాను ఆర్డర్ చేశాడు. అయితే కస్టమర్ స్పెషన్‌ చెస్ట్ పీస్ అడిగితే రెస్టారెంట్‌ సిబ్బంది మాత్రం అతనికి వింగ్ పీస్ తీసుకొచ్చి ఇచ్చాడు.

అయితే కస్టమర్ నేన్‌ ఆర్డర్ చేసింది ఇది కాదని.. వేరే సర్వెంట్‌ను పిలవమని సిబ్బదితో అన్నాడు. దీంతో ఆ సిబ్బంది కోపంతో తింటే తినండి, లేదంటే వదిలేయండి అని దురుసుగా ప్రవర్తించాడు. దీంతో కస్టమర్‌, రెస్టారెంట్‌ సిబంది మధ్య వాగ్వాదం చెలరేగింది. ఇది కాస్తా మాటమాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ దాడిలో కస్టమర్ నుదిటిపై గాయాలు అయ్యాయి. దీంతో రెస్టారెంట్‌ సిబ్బంది అక్కడి నుంచి పారిపోయాడు.

కస్టమర్‌కు గాయాలు కావడంతో అక్కడున్న స్థానికులు అతన్ని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్న తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.