Karnataka Government: కర్ణాటక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆలయాల్లో అర్చకత్వం చేసే బ్రాహ్మణ యువకులను పెళ్లి చేసుకునే యువతుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అర్చకులను వివాహమాడే యువతులకు ‘మైత్రి’ పథకం కింద రూ. 3 లక్షలు ప్రోత్సాహక బహుమతిని అందజేయనున్నట్లు తెలిపింది. అయితే, ఇది తొలుత బాండ్ రూపంలో ఇస్తామని, మూడు సంవత్సరాల తరువాత ఈ బాండ్‌ను నగదు రూపంలో మార్చుకోవచ్చు అని అధికారులు తెలిపారు. కాగా.. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ‘మైత్రి’ పథకాన్ని ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ పథకంలో భాగంగా అర్చకులు, పురోహితులతో వివాహాలను ప్రోత్సహించేందుకు గానూ యువతులకు ఈ నగదు ప్రోత్సాహం అందజేస్తున్నారు. అయితే, ఈ పథకం గురించి రాష్ట్ర బ్రాహ్మణ అభివృద్ధి బోర్డు చైర్మన్ ఎస్‌హెచ్ సచ్చిదానంద మరిన్ని వివరాలను ప్రజలకు వెల్లడించారు. యువతులతో పాటు.. నిరుపేద బ్రాహ్మణ యువతులను వివాహం చేసుకునేందుకు ముందుకొచ్చే పురోహితులు, అర్చకులకు రూ. 25వేల ప్రోత్సాహకాన్ని అందిస్తామన్నారు. అలాగే.. ఒక ఎకరాలోపు పొలం ఉన్న వారికి బోరుబావి తవ్వించేందుకు, ట్రాక్టర్ కొనుగోలుకు, పాడి పరిశ్రమకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు.
Also read:
AP Cm YS Jagan Visits: నేడు కర్నూలు జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన