కంగనా 2 కోట్ల డిమాండ్ చట్ట ధిక్కరణే ! ముంబై మున్సిపల్ కార్పొరేషన్

| Edited By: Anil kumar poka

Sep 19, 2020 | 12:12 PM

ముంబైలోని తన కార్యాలయాన్ని కూల్చివేసినందుకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తనకు రూ. 2 కోట్లను పరిహారంగా చెల్లించాలంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దాఖలు చేసిన పిటిషన్ చట్ట ధిక్కారమేనని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది.

కంగనా 2 కోట్ల డిమాండ్ చట్ట ధిక్కరణే ! ముంబై మున్సిపల్ కార్పొరేషన్
Follow us on

ముంబైలోని తన కార్యాలయాన్ని కూల్చివేసినందుకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తనకు రూ. 2 కోట్లను పరిహారంగా చెల్లించాలంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దాఖలు చేసిన పిటిషన్ చట్ట ధిక్కారమేనని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది. ఈ మేరకు బాంబే హైకోర్టులో తన సమాధానం తాలూకు అఫిడవిట్ ను సమర్పించింది. ఆమె వేసిన పిటిషన్ ను కొట్టివేయాలని, ఆమె నుంచి ఖర్చులను రాబట్టాలని అభ్యర్థించింది. అసలు ఆమె పిటిషన్ విచారణకు నిలువబోదని కూడా తెలిపింది.

ఈ నెల 9 న ముంబైలోని కంగనా మణికర్ణికా కార్యాలయాన్ని కార్పొరేషన్ అధికారులు పాక్షికంగా కూల్చివేశారు. దీనిపై ఇటీవలే కంగనా.. తన కలలపై, తన భవిష్యత్తుపై ‘అత్యాచారం’ జరిగిందని, తనకు రూ. 2 కోట్ల పరిహారం చెల్లించాలంటూ కోర్టులో సవరణ పిటిషన్ దాఖలు చేసింది. కాగా… ఆమె పిటిషన్ పై ఈ నెల 22 న కోర్టు విచారణ జరపనుంది.