Shivpal Singh: 64 ఏళ్ల వయసులో జడ్జి శివ్‌పాల్‌సింగ్‌ ప్రేమ పెళ్లి! లాలూ దాణా కుంభకోణం కేసులో తీర్పునిచ్చిన జడ్జి ఈయనే..

దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు శిక్ష విధించిన న్యాయమూర్తి శివపాల్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు..

Shivpal Singh: 64 ఏళ్ల వయసులో జడ్జి శివ్‌పాల్‌సింగ్‌ ప్రేమ పెళ్లి! లాలూ దాణా కుంభకోణం కేసులో తీర్పునిచ్చిన జడ్జి ఈయనే..
Judge Shivpal Singh

Updated on: Sep 06, 2022 | 11:02 AM

Judge Shivpal Singh second marriage: దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు శిక్ష విధించిన న్యాయమూర్తి శివపాల్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆరు నెలల్లో రిటైర్‌మెంట్ తీసుకోనున్న శివపాల్ సింగ్ బీజేపీ నాయకురాలిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వివరాల్లోకెళ్తే.. ఝార్ఖండ్‌లోని గొడ్డా జిల్లా జడ్జి శివ్‌పాల్‌సింగ్‌ (64), బీజేపీ నాయకురాలు, లాయరు అయిన నూతన్‌ తివారీ (50)ని రెండో పెళ్లి చేసుకున్నారు. కాగా శివ్‌పాల్‌సింగ్‌ సింగ్‌ భార్య 2006లో మరణించింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. ఇక లాయరు నూతన్‌ తివారీ మొదటి భర్త మరణించాడు. జీవిత భాగస్వాములను కోల్పోయిన జడ్జి, లాయరుగారు తమ తదుపరి జీవితాన్ని ఒకరికొకరు పంచుకోవాలని నిర్ణించుకుని వివాహం చేసుకున్నారు. ఇక ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్ యాదవ్‌ దాణా కుంభకోణం కేసు విచారణ సమయంలో న్యాయమూర్తి శివపాల్ సింగ్, లాలూ మధ్య జరిగిన సంభాషణ అప్పట్లో దేశవ్యప్తంగా సంచలం రేపింది. ఈ కేసు సమయంలో శివపాల్ సింగ్ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జిగా ఉన్నారు.