Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో టెర్రర్‌ నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. నలుగురు ఉద్యోగుల తొలగింపు..

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో టెర్రర్‌ నెట్‌వర్క్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో..

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో టెర్రర్‌ నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. నలుగురు ఉద్యోగుల తొలగింపు..
Jammu And Kashmir

Updated on: Aug 14, 2022 | 10:22 AM

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో టెర్రర్‌ నెట్‌వర్క్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జమ్మూకశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం సీరియస్‌ చర్యలు తీసుకుంది. జమ్ముకశ్మీర్ ప్రభుత్వం నలుగురు ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగించింది. టెర్రర్ ఫండింగ్ నిందితుడు బిట్టా కరాటే భార్య అస్సాబా అర్జూమండ్ ఖాన్‌ను కూడా ఉద్యోగం నుంచి తొలగించారు.

జేకేఎల్ఎఫ్ టాప్ టెర్రరిస్టులో ఫరూఖ్ అహ్మద్ డర్ అలియాస్ బిట్టాకరాటే ఒకరు. ఆయన భార్య అస్సాబా అర్జూమండ్ 2011 బ్యాచ్ జేకేఏఎస్ ఆఫీసర్. ప్రభుత్వ సర్వీసు నుంచి తొలగించిన వారిలో నిషేధిత హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్‌ సలావుద్దీన్ కుమారుడు సైయద్ అబ్దుల్ ముయీద్ కూడా ఉన్నారు. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శాఖలోని సమాచార, సాంకేతిక విభాగం మేనేజర్‌గా ముయూద్ ఉన్నాడు. ఈ నలుగురు ఉద్యోగులను రాజ్యాంగంలోని 311 ఆర్టికల్ కింద సర్వీసు నుంచి తొలగించారు. దర్యాప్తు లేకుండానే తమ ఉద్యోగులను తొలగించే అధికారాన్ని ప్రభుత్వానికి ఈ అధికరణ కల్పిస్తుంది.

ఫరూక్ అమ్మద్ డర్ అలియాస్ బిట్టా కరాటే ప్రస్తుతం ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. ఆయన భార్య అస్సాబా-ఉల్-అర్జమాండ్ ఖాన్ జమ్మూకశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీ్స్‌ ఆఫీసర్‌గా రూరల్ డెవలప్‌ డైరెక్టరేట్‌లో ఉన్నారు. కాగా, సర్వీసు నుంచి ప్రభుత్వం తొలగించిన తక్కిన ఇద్దరిలో సైంటిస్ట్ డాక్టర్ ముహీద్ అహ్మద్ భట్, కశ్మీర్ యూనివర్శిటీ సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మజిద్ హుస్సేన్ ఖాదిరి ఉన్నారు. బిట్టా కరాటే కశ్మీర్‌ పండిట్లు ఊచకోతకు కుట్ర చేసినట్టు కూడా దర్యాప్తులో వెల్లడయ్యింది. జమ్ముకశ్మీర్‌ గత నెలరోజుల నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేళ ముష్కరులు పన్నిన కుట్రలను భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు భగ్నం చేస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us