Viral Video: జాతీయ జెండా రంగుల్లో రిబ్బను ఏర్పాటు.. సీఎం ఏం చేశారో చూడండి..

జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా జాతీయ జెండాపై తనుకు ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. ఇటీవల ఆయన ఓ ప్రారంభోత్సవానికి వెళ్లగా అక్కడ జాతీయ జెండా రంగులతో ఉన్న రెబ్బన్‌ను కటింగ్‌ కోసం ఏర్పాటు చేశారు. అయితే అది గమనించిన ఆయన రిబ్బన్‌ను కట్ చేయడానికి నిరాకరించాడు. మువ్వన్నెల జెండాను ఎవరైనా కట్‌చేస్తారా అని నిర్వాహకులను ప్రశ్నించి జెండాపై తనకున్న గౌరవాన్ని చాటి చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: జాతీయ జెండా రంగుల్లో రిబ్బను ఏర్పాటు.. సీఎం ఏం చేశారో చూడండి..
Omar Abdullah National Flag

Updated on: Apr 16, 2026 | 8:29 AM

ఇటీవల శ్రీనగర్‌లోని కాశ్మీర్ హాట్ లో జరిగిన నో యువర్ ఆర్టిసన్స్ ప్రదర్శనను ప్రారంభోత్సవానికి సీఎం ఒమర్ అబ్దుల్లా ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన రిబ్బన్ కట్‌ చేసి ప్రదర్శనను ప్రారంభించాల్సి ఉంది. అయితే నిర్వాహకులు ప్రారంభోత్సవానికి జాతీయ జెండా రంగులతో కూడా రిబ్బను ఏర్పాటు చేశారు. అది గమనించిన సీఎం ఒమర్ అబ్దుల్లా ఒక్కసారిగా ఆగారు. ఈ రిబ్బన్‌ను తాను కట్‌ చేయలేనని చెప్పేశాడు. మువ్వనెల జెండాను ఎవరైనా కట్‌చేస్తారా? వెంటనే రెండు వైపుల నుంచి ఈ రిబ్బన్‌ విప్పేయాలని నిర్వాహకులకు సూచించారు.

సీఎంపై ప్రశంసలు

సీఎం ఆదేశంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆ రిబ్బన్‌ను కట్ చేయకుండా తొలగించారు. ఆ తర్వాతే ఆయన లోపలికి వెళ్లి ప్రదర్శనను సందర్శించారు. అక్కడున్న కొందరు వ్యక్తులు ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తతుం ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆయన సమయస్ఫూర్తిని, జాతీయ జెండా పట్ల ఆయనకు ఉన్న గౌరవాన్ని ప్రశంసిస్తున్నారు.

వీడియో చూడండి..

నిర్వాహకులపై విమర్శలు

ఇదిలా ఉండగా ప్రారంభోత్సవానికి జాతీయ జెండా రంగులో ఉన్న రిబ్బన్ ఏర్పాటు చేసిన నిర్వాహకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పొరపాటు చేసిన ప్రైవేట్ సంస్థ నిర్వాహకులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ జెండా రంగులను రిబ్బన్‌గా వాడటం బుద్దిలేని పని అని పలువురు అభిప్రాయపడ్డారు. ఒమర్ అబ్దుల్లా తీసుకున్న ఈ నిర్ణయం ఆయన దేశభక్తిని, జెండాపై ఆయనకు ఉన్న గౌరవాన్ని చాటిచెప్పిందని రాజకీయ ప్రముఖులు సైతం కొనియాడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us