దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులకు ఉగ్రవాదుల కుట్ర.. టెర్రరిస్టుల హిట్‌లిస్ట్‌లో పలువురు నేతలు!

దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులు చేయడం.. రాజకీయ ప్రముఖులే టార్గెట్‌గా ఆ దాడులు చేయడం ఉగ్రవాదుల లక్ష్యంగా గుర్తించారు. ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్న ఐదుగురు ఐసిస్‌ ఉగ్రవాదులు విచారణలో సంచలన విషయాలు వెల్లడించారు. తమ హిట్‌లిస్ట్‌లో పలువురు నేతలు ఉన్నట్టు తెలిపారు. ఆత్మాహుతి దాడుల కోసం సూసైడ్‌ జాకెట్లు , బాంబు కూడా రెడీ చేసుకున్నారు. ఈ గ్యాంగ్‌లో మొత్తం 40 మంది సభ్యులు ఉన్నట్టు గుర్తించారు.

దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులకు ఉగ్రవాదుల కుట్ర.. టెర్రరిస్టుల హిట్‌లిస్ట్‌లో పలువురు నేతలు!
Isis Terrorists Arrest

Updated on: Sep 12, 2025 | 4:41 PM

దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులు చేయడం.. రాజకీయ ప్రముఖులే టార్గెట్‌గా ఆ దాడులు చేయడం ఉగ్రవాదుల లక్ష్యంగా గుర్తించారు. ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్న ఐదుగురు ఐసిస్‌ ఉగ్రవాదులు విచారణలో సంచలన విషయాలు వెల్లడించారు. తమ హిట్‌లిస్ట్‌లో పలువురు నేతలు ఉన్నట్టు తెలిపారు. ఆత్మాహుతి దాడుల కోసం సూసైడ్‌ జాకెట్లు , బాంబు కూడా రెడీ చేసుకున్నారు. ఈ గ్యాంగ్‌లో మొత్తం 40 మంది సభ్యులు ఉన్నట్టు గుర్తించారు. ఈ గ్యాంగ్‌కు డానీష్‌ నేతృత్వం వహిస్తునట్టు దర్యాప్తులో తేలింది. డానీష్‌కు సీఈవో అని కోడ్‌నేమ్‌ కూడా ఇచ్చారు. పాకిస్తాన్‌ నుంచి సిగ్నల్‌ యాప్‌లో ఈ గ్యాంగ్‌కు ఆదేశాలు అందుతున్నట్టు గుర్తించారు.

ఢిల్లీ పోలీసులు దేశవ్యాప్తంగా దాడులు చేసి ఈ కుట్రను భగ్నం చేశారు. కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డానీష్‌ను జార్ఖండ్‌ లోని రాంచీలో పట్టుకున్నారు. మిగిలిన నిందితుల్లో ముంబైకి చెందిన అఫ్తాబ్, సుఫీయాన్‌లను ఢిల్లీలో.. హుజైఫా యామన్‌ను తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లోను.. ఖమ్రాన్‌ ఖురేషీని మధ్యప్రదేశ్‌లో అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన ఉగ్రవాదులకు కెమికల్‌ వెపన్స్‌ ఆయుధాల తయారీలో కూడా నైపుణ్యం ఉంది. ఎంతోమంది యువకులు టెర్రరిజం వైపు ఆకర్షితులను చేస్తున్నారు. ఉగ్రవాదుల దగ్గరి నుంచి పెద్ద మొత్తంలో ఐఈడీ బాంబుల తయారీకి వాడే ముడిపదార్థాలు, పలురకాల పరికరాలు, పిస్టల్, ల్యాప్‌టాప్‌లు, మాస్కులు, సెల్‌ఫోన్లు, నగదు, హైడ్రోక్లోరిక్, నైట్రిక్‌ ఆమ్లాలు, సల్ఫర్‌ పౌడర్, వైర్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మాడ్యూల్‌లో దాదాపు 40 మంది క్రియాశీల సభ్యులు ఉన్నారని, వారిలో ఐదుగురికి మాత్రమే ఉగ్రవాద కార్యకలాపాల గురించి తెలుసని వర్గాలు తెలిపాయి.

ప్రధాన నిందితుడు అషర్ డానిష్‌ను రాంచీలో అరెస్టు చేశారు. డానిష్ గతంలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైసెస్ (IED) తయారు చేస్తున్నప్పుడు గాయపడ్డాడు. అతను ఇంగ్లీషులో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు. ‘గజ్వా’ అనే కోడ్ పేరుతో ఐసిస్‌లోకి వెళ్లాడు. అతను ఈ సంవత్సరం జనవరిలో నగరానికి వచ్చి విద్యార్థిగా వేషంలో ఉన్నాడని నిఘా వర్గాలు తెలిపాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..