Ambassador Car: ఆహా అంబాసిడర్‌..! స్క్రాప్‌తో అద్భుతంగా తీర్చిదిద్దిన ఆర్టిస్ట్.. నెటిజన్ల ప్రశంసలు

Artistic touch to old Ambassador Car: అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల కాదేదీ కవిత కనర్హం అన్నారు శ్రీశ్రీ.. అయితే కళకు కూడా కాదేదీ కనర్హం అంటున్నారు ఇండోర్‌కు చెందిన సుందర్‌ గుర్జార్‌.

Ambassador Car: ఆహా అంబాసిడర్‌..! స్క్రాప్‌తో అద్భుతంగా తీర్చిదిద్దిన ఆర్టిస్ట్.. నెటిజన్ల ప్రశంసలు
Scrap Car

Updated on: Apr 01, 2022 | 6:05 AM

Artistic touch to old Ambassador Car: అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల కాదేదీ కవిత కనర్హం అన్నారు శ్రీశ్రీ.. అయితే కళకు కూడా కాదేదీ కనర్హం అంటున్నారు ఇండోర్‌కు చెందిన సుందర్‌ గుర్జార్‌. స్క్రాప్‌ వస్తువులతో ఆయన తయారు చేసిన ఓ కారు ఇప్పుడు అందరికీ ఆకట్టుకుంటోంది. అంబాసిడర్‌ (Ambassador) కారు ఉంటే ఒకప్పుడు ఆ లగ్జరీనే వేరు. ఎన్ని కార్లు వచ్చినా అంబాసిబర్‌ కారు ఇప్పటికీ చాలా మందిలో ఓ ముద్ర వేసింది. కొన్ని దశాబ్దాల పాటు వాహన ప్రియులను తన మేనియాలో పడేసింది అంబాసిడర్‌. అయితే కొత్త కార్ల రాకతో ఇప్పుడు అంబాసిడర్‌ కారు కనుమరుగైంది. అయితే చాలా చోట్ల పాత అంబాసిడర్‌ కార్లు దుమ్ముకొట్టిపోయి దర్శనమిస్తుంటాయి. అలాంటి ఓ పాత అంబాసిడర్‌ కారుకు కొత్త సొబగులు అద్దారు ఇండోర్‌ (Indore) కు ఓ ఆర్టిస్ట్‌.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు సుందర్‌ గుర్జార్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ చదివారు. ఎన్నో వస్తువులకు తన కళ ద్వారా కొత్త రూపు తీసుకొచ్చారు. తాజాగా ఆయన కన్ను ఓ పాత అంబాసిడర్‌ కారు మీద పడింది. అంతే చకచకా తన మెదడులో మెదిలిన ఐడియాను అమలు చేశారు సుందర్‌. వెయ్యి కేజీల స్ర్కాప్‌ మెటీరియల్‌తో అంబాసిడర్‌ కారుకు కొత్త రూపును తీసుకొచ్చారు. కారు చుట్టూ 700 కిలోగ్రామ్‌ నట్లను అందంగా అమర్చారు సుందర్‌. మరో 400 కిలోగ్రామ్‌ల వాహనాల చైయిన్‌తో పాటు మిగతా భాగాలను అమర్చారు. మొత్తం ఈ కారును ఇప్పుడున్న స్థితికి తీసుకురావడానికి తనకు మూడు నెలల సమయం పట్టిందని సుందర్‌ తెలిపారు.

Car

ఇప్పటికే ఇలాంటి అనేక పాత వస్తువులకు కొత్త రూపు తీసుకొచ్చానని తెలిపారు సుందర్‌. పాత వస్తువులతో మూడు నెలల పాటు తీర్చిదిద్దిన అంబాసిడర్‌ కారు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మళ్లీ అప్పటి పాత రోజుల్లో అంబాసిడర్‌ కారు దర్జాను గుర్తుకు తెస్తోంది. తెల్లని అంబాసిడర్‌ కాస్తా నట్లు, చైయిన్లతో నల్లగా మారిపోయింది. అయితే చాలా అందంగా మెరిసిపోతోంది. ఈ అంబాసిడర్‌ కారుకు కొత్త సొబగులు అద్దిన ఆర్టిస్ట్‌ సుందర్‌ గర్జార్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు వాహన ప్రేమికులు.

Also Read:

Ratan Tata: అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేం.. రతన్ టాటాకు భారతరత్న ఇవాలన్న పిటిషన్ కొట్టివేత

Rahul Karnataka visit: కర్నాటకలో ముందస్తు ఎన్నికలు వస్తాయా.. రాహుల్‌గాంధీ శ్రీసిద్ధగంగా టూర్ అందుకేనా?