
దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభంలో చిక్కుకుంది. సిబ్బంది కొరతతో సతమతం అవుతున్న ఇండిగో.. తీరుతో ప్రయాణికుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఇండిగో విమానాలు రద్దయ్యాయి.. అయితే.. కొన్ని విమానాలు మాత్రం ఆలస్యంగా నడుస్తున్నాయి.. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు గోవా, అహ్మదాబాద్‌లో సర్వీసులు రద్దయ్యాయి.. సాంకేతికలోపం, సిబ్బంది కొరతతో విమానసేవల్లో సమస్యలు మొదలయ్యాయి.. ఈ క్రమంలో ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిలేషన్స్ ఎఫెక్ట్ పెళ్లిళ్లు, శుభకార్యాలపై కూడా పడుతోంది.. ఇప్పుడు చూడబోతోంది అలాంటి ఘటనలే.. ఓచోట కొత్త జంట వాళ్ల రిసెప్షన్‌కి వాళ్లే వెళ్లలేకపోతే.. మరోచోట పెళ్లికొడుకు ఎయిర్‌పోర్ట్‌లో ఇరుక్కుపోయాడు..
అబ్బాయిది భువనేశ్వర్.. అమ్మాయిది హుబ్లీ.. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే.. వీళ్లపెళ్లి నవంబర్ 23న భువనేశ్వర్‌లో జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి హుబ్లీ వెళ్లాలి. స్థానికంగా బంధువుల కోసం అక్కడ ఏర్పాటు చేసిన రిసెప్షన్‌లో పాల్గొనాలి. ఇందుకోసం ముందే టికెట్స్ బుక్ చేసుకున్నారు. తీరా ఇప్పుడు ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ల కారణంగా వాళ్ల రిసెప్షన్‌కే వాళ్లు వెళ్లలేని పరిస్థితి. దీంతో.. అబ్బాయి తల్లిదండ్రులే స్టేజ్‌పై ఉండి.. కొత్త జంటను ఆన్‌లైన్‌లో రమ్మని చెప్పి.. వాళ్ల కోసం ఒక స్క్రీన్ ఏర్పాటు చేశారు. మొత్తానికి రిసెప్షన్ అయ్యిందనిపించారు.
Wedding Reception
బెంగళూరులో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు హుబ్బల్లికి మేధా క్షీరసాగర్, ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన సంగమ దాస్‌ల రిసెప్షన్ హుబ్బళ్లిలోని గుజరాత్ భవన్‌లో జరగాల్సి ఉండగా.. చివరకు ఇలా రిసెప్షన్ జరిగిందని కుటుంబసభ్యులు తెలిపారు.
Techie Couple
ఫ్లైయిట్ రాకపోవడంతో బెంగళూరు ఎయిర్‌పోర్టులో పెళ్లికొడుకు తిప్పలు పడ్డాయి.. బెంగళూరు నుంచి హైదరాబాద్ రావాల్సిన యువకుడు.. చెకిన్ అయిపోయినా గంటల తరబడి ఎయిర్‌పోర్ట్‌లోనే పడిగాపులు కాసాడు.. బ్యాగేజ్ వెనక్కు ఇమ్మని బతిమాలినా ఇండిగో టీమ్ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తంచేశాడు. పెళ్లిబట్టలన్నీ లగేజ్‌లో ఉండిపోవడంతో అయోమయంలో పడ్డాడు.. కార్‌లో హైదరాబాద్ వద్దామన్నా పెళ్లిబట్టల కోసం వెయిటింగ్ చేస్తున్నట్లు యువకుడు టీవీ9కి చెప్పాడు..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..