Maitri Patel: పట్టుదలతో పేదరికాన్ని ఓడించింది.. సవాళ్లను ఎదుర్కొంటూ 19 ఏళ్లకే పైలెట్‏గా మారిన మైత్రీ పటేల్..

|

Sep 11, 2021 | 10:07 PM

పట్టుదల ఉంటే ప్రపంచాన్ని సైతం ఎదురించవచ్చు. సాధించాలనుకుంటే ఎన్ని సవాళ్లైనా.. ఎన్ని అడ్డుంకులనైనా అధిగమించవచ్చు.

Maitri Patel: పట్టుదలతో పేదరికాన్ని ఓడించింది.. సవాళ్లను ఎదుర్కొంటూ 19 ఏళ్లకే పైలెట్‏గా మారిన మైత్రీ పటేల్..
Maitri Patel
Follow us on

పట్టుదల ఉంటే ప్రపంచాన్ని సైతం ఎదురించవచ్చు. సాధించాలనుకుంటే ఎన్ని సవాళ్లైనా.. ఎన్ని అడ్డుంకులనైనా అధిగమించవచ్చు. పట్టుదల ముందు పేదరికం.. కష్టాలు.. సవాళ్లు.. అడ్డుంకులను ఎదుర్కొవచ్చని ఓ పంతోమ్మిదేళ్ల అమ్మాయి నిరూపించించింది. అతి చిన్న వయసులోనే పైలెట్ అయి రికార్డ్ సృష్టించింది. అనుకున్న దారిలో ఎదురైన అడ్డంకులను ఎదుర్కోని లక్ష్యాన్ని సాధించి ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచింది మైత్రీ పటేల్. 8 సంవత్సరాల నుంచే పైలెట్ కావాలని నిర్ణయించుకున్నాని చెప్పింది మైత్రీ పటేల్.

ఆమె పట్టుదల ముందు పేదరికం ఓడిపోయింది. దేశం‍లోనే అత్యంత పిన్న వయసులో కమర్షియల్‌ పైలట్‌ అయిన ఘనత సాధించింది మైత్రి పటేల్‌. 19ఏళ్ల వయసులోనే తన ప్రయాణంలో ఎదురైన సవాళ్లన్నింటిని అధిగమించింది. కేవలం 11 నెలల్లోనే పైలెట్‌ ట్రైనింగ్‌ ఫినిష్‌ చేసి, వావ్‌ అనిపించారు మైత్రి. ఆమె తండ్రి కాంతిలాల్‌ పటేల్‌ పడవ నడుపుతూ.. జీవనం కొనసాగిస్తున్నారు. అయితే విమానాలు టేక్‌ ఆఫ్‌, ల్యాండ్‌ అవ్వడం చూస్తూ ఉండేవాడినని, అలా చూసినప్పుడల్లా.. తన కూతురు కూడా ఫైలట్‌ కావాలని కలలు కనేవాడని చెప్పుకొచ్చారు కాంతిలాల్‌. ఇప్పుడా ఆ కలలన్నీ నిజం అయ్యాయని.. భావోద్వేగానికి గురయ్యారు. చిన్నప్పుడే తన కూతురు పైలెట్ అవ్వాలని కళలు కన్నాడు మైత్రీ తండ్రి. ఇందుకోసం ఆమెను ప్రైవేట్ పాఠశాలలో చేర్పించాడు. తన కుమార్తె శిక్షణా కోర్సు కోసం తనకున్న భూమీలో సగభాగాన్ని విక్రయించాడు. ఆమె తండ్రి ఓల్పాడ్ ప్రాంతంలో రైతు, ఆమె తల్లి సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగంలో పనిచేస్తోంది. రెండు రోజుల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రాంనిక్‌లాల్ రూపానీ మైత్రి పటేల్‌ని కలుసుకుని అతి పిన్న వయస్కురాలైన మహిళా వాణిజ్య పైలట్ అయినందుకు ఆమెను అభినందించారు.

Also Read: JP Nadda: ప్రధాని మోదీ నాయకత్వంలో కులతత్వం, మతతత్వం, వారసత్వం, రాచరికం అన్నీ అంతమొందాయ్ : జేపీ నడ్డా

Sai Dharam Tej Bike Accident: సాయి ధరమ్ తేజ్ సెకండ్ హ్యాండ్ బైక్ కొన్నాడు.. ప్రమాదంపై పూర్తి వివరాలను ప్రకటించిన పోలీసులు..

Sai Dharam Tej-Naresh: సాయి ధరమ్ ప్రమాదంపై తాను చేసిన వ్యాఖ్యలపై నరేష్ వివరణ.. తన బిడ్డలాంటివాడు.. బాగుండాలని కోరుకుంటున్నా…