Jammu Kashmir: భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. పాక్‌ సైనిక దాడిని తిప్పికొట్టిన భారత్‌!

పహల్గామ్‌లోని బైసరన్‌లోయలో ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల తీవ్ర స్థాయికి చేరాయి. ఈ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌ మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్, పాక్ కశ్మీర్ సరిహద్దుల్లో వరుసగా నాలుగో రోజు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. భారత సైన్యం అప్రమత్తమై.. సమర్థవంతంగా కాల్పులను తిప్పికొట్టాయి.

Jammu Kashmir: భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. పాక్‌ సైనిక దాడిని తిప్పికొట్టిన భారత్‌!
Loc

Updated on: Apr 28, 2025 | 8:56 AM

పహల్గామ్‌లోని బైసరన్‌లోయలో ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల తీవ్రస్థాయికి చేరాయి. ఈ ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన భారత్‌ ప్రభుత్వం పాక్‌కు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య దౌత్య ఒప్పందాలను రద్దు చేసింది. అంతేకాకుండా పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. భారత్‌లో ఉన్న పాకిస్థాన్‌ దేశస్తులు వెంటనే దేశం వదిలి వెళ్లాలనే ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు అటారీ సరిహద్దును కూడా మూసివేసింది. భారత్‌ ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో పాక్‌ సైన్యం భారత్‌-కాశ్మీర్‌ సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతోంది.

విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి భారత సైనిక పోస్టుల లక్ష్యంగా వరుసగా నాలుగో రోజు పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం.. పాక్‌ సైన్యం కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని భారత సైన్యం వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…