నేపాల్ నూతన పొలిటికల్ మ్యాప్.. ఇండియా సైలెంట్

నేపాల్ లో వివాదాస్పాద లింపియాదుర, లిపులేఖ్, కాలాపానీ తమ దేశ భూభాగాలేనని చూపే పొలిటికల్ మ్యాప్ ని ఆ దేశం రూపొందించింది. కానీ దీనిని పార్లమెంట్ ఆమోదించాలంటే రాజ్యాంగ సవరణ..

నేపాల్ నూతన పొలిటికల్ మ్యాప్.. ఇండియా సైలెంట్

Edited By:

Updated on: Jun 09, 2020 | 4:13 PM

నేపాల్ లో వివాదాస్పాద లింపియాదుర, లిపులేఖ్, కాలాపానీ తమ దేశ భూభాగాలేనని చూపే పొలిటికల్ మ్యాప్ ని ఆ దేశం రూపొందించింది. కానీ దీనిని పార్లమెంట్ ఆమోదించాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి.. కొత్త నేషనల్ ఎంబ్లమ్ లోని నూతన మ్యాప్ కి అనుగుణంగా నేపాలీ రాజ్యాంగం లోని 3 వ అధికరణాన్ని సవరించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రతినిధుల సభ మంగళవారం చేబట్టింది. ఎగువ సభ లేదా నేషనల్ అసెంబ్లీ కూడా ఈ బిల్లును చేపట్టాల్సి ఉంది. ఈ సవరణపై స్పందించేందుకు నేపాల్ ఎంపీలకు 72 గంటల సమయాన్ని ఇస్తారు. అనంతరం వారి స్పందనను బట్టి ఇది ఆమోదం పొందినట్టు ప్రకటిస్తారు. నాలుగైదు రోజుల్లో దీన్ని ఆమోదిస్తే.. ఇదే ప్రొసీజర్ ని నేషనల్ అసెంబ్లీ కూడా పాటిస్తుందని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు బిష్ణు రిజాల్ ట్వీట్ చేశారు. కాగా… తమ దేశ భూభాగాలను తాము వదులుకునే ప్రసక్తి లేదని నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి ఇదివరకే ప్రకటించారు.  ఆ దేశంలో ఈ మ్యాప్ ఆమోదానికి ఇంత తతంగం జరుగుతున్నా భారత ప్రభుత్వం మౌనంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us