Corona Update: దేశంలో దడ పుట్టిస్తున్న కరోనా.. రికార్డు స్థాయిలో భారీగా పాజిటివ్ కేసులు.. ఎన్నంటే.!

Corona Cases Update: దేశంలో కరోనా(Corona) థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూపోతోంది.

Corona Update: దేశంలో దడ పుట్టిస్తున్న కరోనా.. రికార్డు స్థాయిలో భారీగా పాజిటివ్ కేసులు.. ఎన్నంటే.!
Coronavirus

Updated on: Jan 20, 2022 | 10:13 AM

దేశంలో కరోనా(Corona) థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూపోతోంది. గడిచిన 24 గంటల్లో రోజూవారి నమోదవుతున్న పాజిటివ్ కేసుల(Covid Positive Cases) సంఖ్య 3 లక్షల మార్క్ దాటింది. నిన్న దేశవ్యాప్తంగా 3,17,532 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా 491 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. దేశంలో పాజిటివిటి రేటు ప్రస్తుతం 16.41 శాతానికి చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ప్రస్తుతం దేశంలో 19,24,051 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా నిన్న కరోనా నుంచి 2,23,990 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం అలజడి సృష్టిస్తోంది. రోజురోజుకూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 9,287 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,59,67,55,879 మందికి టీకాలు వేసినట్లు కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో 73,38,592 టీకా డోసులు వేసినట్లు కేంద్రం తెలిపింది.

Loading...
Unable to load recommendations.
Follow Us